తెలంగాణNEET UG 2026 Exam | నేడు యూజీ నీట్​.. 24 జిల్లాల్లో 199 కేంద్రాల...

NEET UG 2026 Exam | నేడు యూజీ నీట్​.. 24 జిల్లాల్లో 199 కేంద్రాల ఏర్పాటు

దేశవ్యాప్తంగా 566 నగరాల్లో ఈ జాతీయ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈసారి దేశవ్యాప్తంగా దాదాపు 22.79 లక్షల మంది నీట్ రాయనున్నారు.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: NEET UG 2026 Exam | ఎంబీబీఎస్ MBBS, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే యూజీ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) – 2026కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు (ఆదివారం, మే 3) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్ష ఉంటుంది.

NEET UG 2026 Exam | 73 వేలకు పైగా

యూజీ నీట్​కు తెలంగాణలో 73 వేలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లాల్లో 199 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నందున 1:30 గంటలకే గేట్లు మూసేస్తారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించరని అధికారులు స్పష్టం చేశారు.

NEET UG 2026 Exam | దేశవ్యాప్తంగా 566 నగరాల్లో

డీఎంఈ డాక్టర్ ఎ. నరేంద్ర కుమార్ నోడల్ ఆఫీసర్​గా, అడిషనల్ డీజీపీ మహేశ్ ఎం.భగవత్ పోలీస్ ప్రతినిధిగా రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

జిల్లా స్థాయిలో కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద డ్యూయల్ లేయర్ ప్రిస్కింగ్, జామర్లు, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ వెరిఫికేషన్​ ద్వారా నిఘా ఉంచారు.

ఇక దేశవ్యాప్తంగా 566 నగరాల్లో ఈ జాతీయ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈసారి దేశవ్యాప్తంగా దాదాపు 22.79 లక్షల మంది నీట్ రాయనున్నారు.

Academy Awards AI Rules | ఆస్కార్​ అవార్డుల్లో కీలక మార్పులు.. ఏఐ వినియోగంపై కొత్త నిబంధనలు!

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Delhi Judge Suicide | న్యాయవ్యవస్థలో విషాదం.. జడ్జి సూసైడ్​!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Delhi Judge Suicide | ఢిల్లీ న్యాయవ్యవస్థలో విషాదం...

May 03 Gold Rates | త‌గ్గుముఖం ప‌డుతున్న బంగారం, వెండి ధరలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 03 Gold Rates | ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న...

May 03 Horoscope | ఆస్తులతో భారీ లాభాలు.. ఈ రాశుల వారి అదృష్టం ఇవాళ పీక్స్‌లో ఉందిగా!

May 03 Horoscope | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నేడు (ఆదివారం,...

Academy Awards AI Rules | ఆస్కార్​ అవార్డుల్లో కీలక మార్పులు.. ఏఐ వినియోగంపై కొత్త నిబంధనలు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Academy Awards AI Rules | ప్రపంచ సినీ...