May 03 Gold Rates | త‌గ్గుముఖం ప‌డుతున్న బంగారం, వెండి ధరలు

Naresh Chandan
May 03 Gold Rates

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 03 Gold Rates | ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న రాజకీయ, ఆర్థిక పరిణామాల ప్రభావంతో ఇటీవల బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడం వల్ల పసిడి, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

అయితే ప్రస్తుతం పరిస్థితులు కాస్త స్థిరపడడంతో ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. మే 3, 2026 ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం దేశీయంగా బంగారం, వెండి ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,50,930గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర Gold Rates రూ.1,38,350గా నమోదైంది. వెండి కిలో ధర రూ.2,65,000గా ఉంది.

May 03 Gold Rates  | ప్రధాన నగరాల్లో..

ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,50,930, 22 క్యారెట్ల బంగారం రూ.1,38,350గా ఉంది. వెండి కిలో ధర రూ.2,70,000గా కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు నమోదయ్యాయి.

దేశ రాజధాని ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,230గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,38,500గా ఉంది. వెండి కిలో ధర రూ.2,65,000గా ఉంది. ముంబైలో బంగారం ధరలు హైదరాబాద్‌తో సమానంగా ఉండగా, వెండి ధర రూ.2,65,000గా నమోదైంది.

చెన్నైలో Chennai బంగారం ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం రూ.1,52,730, 22 క్యారెట్ల బంగారం రూ.1,40,000గా ఉంది. వెండి కిలో ధర రూ.2,70,000గా ఉంది. బెంగళూరులో కూడా బంగారం ధరలు హైదరాబాద్ స్థాయిలోనే ఉండగా, వెండి ధర రూ.2,65,000గా కొనసాగుతోంది.

May 03 Gold Rates | స్థానిక మార్కెట్ ధర..

గమనించాల్సిన విషయం ఏమిటంటే, బంగారం, వెండి ధరలు ప్రతి నగరంలో ఒకేలా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, రాష్ట్ర పన్నులు వంటి అంశాల ప్రభావంతో ధరల్లో మార్పులు వస్తుంటాయి. అందువల్ల కొనుగోలు చేసే ముందు స్థానిక మార్కెట్ ధరలను తప్పనిసరిగా పరిశీలించడం మంచిది.

May 03 Horoscope | ఆస్తులతో భారీ లాభాలు.. ఈ రాశుల వారి అదృష్టం ఇవాళ పీక్స్‌లో ఉందిగా!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *