School Fee Regulation | ఫీజుల నియంత్రణ చట్టం ఎప్పుడు తెస్తారు : కవిత

రాష్ట్రంలో పాఠశాల ఫీజుల నియంత్రణ చట్టం తీసుకు రావాలని టీఆర్​ఎస్​ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్​ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : School Fee Regulation | విద్యా సంవత్సరం మొదలై మూడు నెలలు గడుస్తుందని, ఫీజుల నియంత్రణ చట్టం ఇంకెప్పుడు తెస్తారని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కవిత (Kavitha) ప్రశ్నించారు. 2024 మే నెలలో స్కూల్ ఫీ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ బిల్ రెండేళ్లుగా కేబినెట్ ను దాటి ఎందుకు ముందుకు రాలేదన్నారు.

ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు పెంచుతూ విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని కవిత ఆరోపించారు. అయినా విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె నిలదీశారు. వంద ఎకరాల ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సైతం భారీగా ఫీజులు పెంచిందన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్య వ్యాపారానికి ముఖ్యమంత్రి కొమ్ము కాస్తూ.. బడ్జెట్ స్కూళ్లను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

School Fee Regulation | తల్లిదండ్రులతో కలిసి పోరాటం

ప్రైవేట్ స్కూళ్లలో ఆయా పాఠశాలల గవర్నింగ్ బాడీనే ఫీజుల ఫిక్స్ చేయాలని కవిత అన్నారు. ప్రతి ఏడాది 5 శాతానికి మించి ఫీజుల పెంపునకు అవకాశమే లేదని గతంలో జీవో ఉందన్నారు. అయినా అది ఎక్కడ అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఫీజుల నియంత్రణ బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్​ చేశారు. అన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులను నియంత్రించాలని కోరారు. లేకపోతే విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి తెలంగాణ రక్షణ సేన ప్రజాపోరాటాలకు దిగుతుందని స్పష్టం చేశారు.

దీనిని కూడా చదవండి : Kerala Car Accident | లారీని ఢీకొన్న కారు.. 8 మంది విద్యార్థుల మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *