అక్షరటుడే, వెబ్డెస్క్ : Kerala Car Accident | కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు.
మధ్య కేరళలోని త్రిసూర్ జిల్లాలో NH-66పై ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి 11:40 గంటల ప్రాంతంలో కైపమంగళంలోని పనంబిక్కున్ను వద్ద ఈ ప్రమాదం జరిగింది. గురువాయూర్ నుండి కొడుంగల్లూర్ వైపు వెళ్తున్న కారు లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టిందని పోలీసులు పేర్కొన్నారు. చనిపోయిన విద్యార్థులను తమిళనాడ (Tamil Nadu)లోని దిండిగల్కు చెందిన వారిగా గుర్తించారు.
Kerala Car Accident | లారీ డ్రైవర్ తప్పిదంతో..
నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ మళ్లించిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద, హైవేకి కుడివైపున లారీని అక్రమంగా నిలిపి ఉంచారు. వేగంగా వెళ్తున్న కారు డ్రైవర్ను లారీని గమనించలేదు. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన కారు లారీని ఢీకొనడంతో ఆరుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చనిపోయారని పోలీసులు తెలిపారు. వారు కొడుంగల్లూర్ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు మృతులలో ఆరుగురిని గుర్తించారు. సూర్య, యువసంజిత్, విశ్వ, జోషువా దిండిగల్కు చెందినవారు కాగా, సంతోష్, ప్రసన్న మదురైకి చెందినవారు.
🚨 8 KILLED AFTER CAR RAMS INTO PARKED LORRY IN KERALA
Eight people were killed after a Tamil Nadu-registered car crashed into the rear of a parked goods lorry at Panambikkunnu in Kaipamangalam, Thrissur, around 11:40 PM on Friday.
The victims reportedly included seven… pic.twitter.com/Nt3DIU5gFz
— contentkikamii (@contentkikamii) September 5, 2026
దీనిని కూడా చదవండి : Cabinet Expansion | తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై మళ్లీ నీలినీడలు.. ఆశావహులకు నిరాశేనా?