అక్షరటుడే, వెబ్డెస్క్: Ravi Kumar Diwakar | ఓ న్యాయమూర్తి నాలుగు నెలల్లో ఏకంగా 22 మందికి మరణశిక్ష విధించారు. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ముజఫర్‌నగర్‌లో ఉన్న ఫాస్ట్-ట్రాక్ కోర్టు అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి రవి కుమార్ దివాకర్ 22 మందికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
దీంతో ఆయన ముందు విచారణకు రావాల్సిన 100 హత్య కేసులను మరొక న్యాయమూర్తికి బదిలీ చేశారు.మరణశిక్ష, జీవిత ఖైదు విధించదగిన నేరాలకు సంబంధించిన ఈ కేసులను, అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి రవి కుమార్ దివాకర్ కోర్టు నుంచి జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి వీరేంద్ర కుమార్ సింగ్ కోర్టుకు బదిలీ చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. వారికి కూడా మరణశిక్ష విధించే అవకాశం ఉందనే ఆందోళన నెలకొందని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రమోద్ త్యాగి పేర్కొన్నారు.
Ravi Kumar Diwakar | కఠిన తీర్పులతో
రవి కుమార్ దివాకర్ 2022లో వారణాసిలోని జ్ఞానవాపి సముదాయం వద్ద వీడియో సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయన కఠినమైన తీర్పులకు ప్రసిద్ధి చెందారు. లక్నోకు చెందిన ఆయన 2009లో అజమ్‌గఢ్‌లో అదనపు సివిల్ జడ్జిగా కెరీర్‌ను ప్రారంభించారు. 2025 నుంచి ముజఫర్‌నగర్‌లో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. పది కేసుల్లో ఆయన 22 మందికి మరణ శిక్ష విధించారు.
ఇది కూడా చదవండి..: Calcutta High Court | మసీదుల లౌడ్‌స్పీకర్ల తొలగింపుపై పిటిషన్ కొట్టివేత