Municipal Workers Protest | అధికారుల వేధింపులు తట్టుకోలేకపోతున్నాం.. బల్దియా ఎదుట కార్మికుల ఆందోళన

చిన్న విషయానికి సైతం అధికారులు తమను టార్గెట్ చేసి వేధింపులకు పాల్పడుతున్నారని మున్సిపల్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Municipal Workers Protest | చిన్న విషయానికి సైతం అధికారులు తమను టార్గెట్ చేసి వేధింపులకు పాల్పడుతున్నారని మున్సిపల్ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం (Municipal Office) ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.

Municipal Workers Protest | శానిటరీ ఇన్​స్పెక్టర్​..

ఈ సందర్భంగా కార్మికులు (Municipal Workers) మాట్లాడుతూ.. సానిటరీ ఇన్​స్పెక్టర్​ ప్రశాంత్ కార్మికుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక్కరోజు ఆలస్యం అయినా వారం రోజుల పాటు పనిలోకి తీసుకోవడం లేదన్నారు. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా డ్యూటీ వేయట్లేదన్నారు. అశోక్ నగర్ రైల్వే గేటు వద్ద చెత్త సంచులు ఆటోలో వేస్తున్న కార్మికుడిపై కమిషనర్ చెప్పుకోలేని భాషలో బూతు పురాణం అందుకున్నారని వారు వాపోయారు. జవాన్​తో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారన్నారు. షాప్ వ్యక్తికి జరిమానా వేయాలని, చెత్త తోసుకుని పోవద్దని కమిషనర్ చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్మికుల పట్ల అధికారుల వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు.

ఆలస్యమైనా విధులకు తీసుకుంటాం..: మున్సిపల్ కమిషనర్ పర్వతాలు

commi

మున్సిపాలిటీలో పారిశుధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, కార్మికులు తమకు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ పర్వతాలు కార్మికులను కోరారు. కార్మికుల ఆందోళన నేపథ్యంలో పలువురు కౌన్సిలర్లు, యూనియన్ లీడర్లు సమస్యలపై చర్చలు జరిపారు. అనంతరం ధర్నా చేస్తున్న కార్మికుల వద్దకు వచ్చిన కమిషనర్ మాట్లాడుతూ.. కార్మికులపై తమకు కోపం లేదన్నారు. కార్మికులు విధులకు హాజరు కాకపోతే తమకు ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. ఇతర సమస్యలు ఏదైనా ఉంటే నేరుగా తననైనా, కౌన్సిలర్ల ద్వారానైనా చెప్పవచ్చని పేర్కొన్నారు. అనుకోని కారణాలతో విధులకు ఆలస్యంగా వచ్చినా విధులకు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్మికుల సంక్షేమం కోసం తాను పరితపిస్తున్నానని తెలిపారు. బీమా ఇన్సూరెన్స్ కోసం కౌన్సిల్ ఆమోదానికి సిద్ధం చేశామని, కార్మికుల కోరిక మేరకు తొలగించిన 40 మంది కార్మికులను కూడా తిరిగి విధుల్లోకి తీసుకుంటామన్నారు.

ఇది కూడా చదవండి..: Mahender Aileni | బయోటెక్నాలజీ విభాగాధిపతిగా డా. మహేందర్ ఐలేని

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *