అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Environmental Protection | ప్రకృతి అంతరిస్తే మానవాళికి ప్రమాదమని పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నగరంలోని మల్లారంలో రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా మొక్కలు నాటారు.
Environmental Protection | పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి
పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని పీసీసీ చీఫ్ (PCC Chief) అన్నారు. అడవులు రోజురోజుకూ అంతరించిపోతున్నాయని.. వాటిని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. చెట్ల పెంపకపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. మొక్కలు నాటడంలో ప్రజల్లో సైతం చైతన్యం రావాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కోరారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చన్నారు.
Environmental Protection | వినాయక్‌నగర్‌లో రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద..

నగరంలోని వినాయక్‌నగర్‌లో హనుమాన్ జంక్షన్ వద్ద మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పీసీసీ చీఫ్ నివాళులు అర్పించారు. దేశాభివృద్ధికి చేసిన సేవలను, యువత, సాంకేతిక రంగం, స్థానిక సంస్థలకు అధిక ప్రాధాన్యత కల్పించిన ఆయన దూరదృష్టిని టీపీసీసీ చీఫ్ స్మరించుకున్నారు. కార్యక్రమంలో డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, కార్పొరేషన్ ఛైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Municipal Workers Protest | అధికారుల వేధింపులు తట్టుకోలేకపోతున్నాం.. బల్దియా ఎదుట కార్మికుల ఆందోళన