Bike Accident in Dichpally | అదుపు తప్పిన బైక్​.. ఇద్దరు యువకుల మృతి

బైక్ అదుపుతప్పి కింద పడిపోయిన ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Bike Accident in Dichpally | బైక్ అదుపు తప్పి కింద పడిపోయిన ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర ఘటన డిచ్‌పల్లి(Dichpally) పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నాగ్‌పూర్(Nagpur) గేట్‌ ప్రాంతంలో 44వ నంబర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

Bike Accident in Dichpally | నిర్మల్​ జిల్లావాసులు..

ఎస్సై అరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్(Nirmal) జిల్లా సోన్ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన దేవుల అక్షయ్(24), పడాల మహేష్(28) ఇద్దరూ బైక్‌పై వెళ్తున్నారు. డిచ్‌పల్లి నాగ్‌పూర్ గేట్‌ సమీపంలో జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో అక్షయ్, మహేష్ తీవ్ర గాయాలతో సంఘటన స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరీఫ్ తెలిపారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *