Nepal Floods | 1300 మందికి చేరిన మృతులు.. ఇంకా తేరుకోని నేపాల్​

ఆకస్మిక వరదలతో అల్లకల్లోలం అయిన నేపాల్​ తేరుకోలేదు. ఇంకా 5 వేల మంది ఆచూకీ దొరకలేదు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Floods | ఆకస్మిక వరదలతో అల్లకల్లోలం అయిన నేపాల్​ ఇంకా తేరుకోలేదు. ఇరదల్లో ఇప్పటికే 1300 మందికి పైగా మృతి చెందారు. మరో 5 వేల మందికి పైగా గల్లంతు అయ్యారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా 275 మంది భారతీయుల ఆచూకీ లభించలేదు.

నేపాల్​లో ఇటీవల ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. త్రిశూర్​ జిల్లాలో వరదల ధాటికి పలు గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. జల విద్యుత్​ కేంద్రాలు ధ్వంసం అయ్యాయి. దీంతో నేపాల్​లోని చాలా గ్రామాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. దీంతో అధికారులు విద్యుత్​ పునరుద్ధరణ పనులు చేపట్టారు. రసువాలోని బెట్రావతిలో విద్యుత్‌ను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Nepal Floods | విద్యుత్​ పునరుద్ధరణ

బెట్రావతిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కొనసాగుతోంది, దీనివల్ల ఇళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు మరియు ఇతర నిత్యావసర సేవలకు అంతరాయం కలుగుతోంది. వీలైనంత త్వరగా కనెక్టివిటీని పునరుద్ధరించడానికి స్థానిక పరిపాలన మరియు విద్యుత్ కార్మికులు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడం నుంచి దెబ్బతిన్న ట్రాన్స్‌మిషన్ లైన్లకు మరమ్మతులు చేయడం, ఇతర మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడం వరకు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనుల్లో స్థానిక గ్రామస్థులు కూడా పాల్గొంటున్నారు.

దీనిని కూడా చదవండి : Bike Accident in Dichpally | అదుపు తప్పిన బైక్​.. ఇద్దరు యువకుల మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.