అక్షరటుడే, వెబ్డెస్క్ : Land Prices | కేపీహెచ్బీ భూములకు వేలంలో రికార్డు ధర లభించింది. గజం భూమి ఏకంగా రూ.2.70 లక్షలు పలికింది.
KPHB ఫేజ్-7లో తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో 16 MIG ఓపెన్ ప్లాట్ల వేలంపాట బుధవారం నిర్వహించారు. ఇందులో గజం భూమి రేటు రూ.1.6 లక్షలుగా నిర్ణయించారు. అయితే వేలంలో అంతకంటే ఎక్కువ పలకడం గమనార్హం. బహిరంగ వేలంతో రూ.47.14 కోట్ల ఆదాయం వచ్చిందని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గౌతమ్ తెలిపింది.
Land Prices | తీవ్రమైన పోటీ..
కేపీహెచ్బీలోని భూములను దక్కించుకోవడానికి పలువురు ఆసక్తి చూపారు. పోటీ అధికంగా ఉండటంతో రికార్డు స్థాయిలో ధర లభించింది. కనీస ధర రూ.1.60 లక్షలుగా నిర్ణయించినా.. ఒక ప్లాట్లో గజం ధర 2.70 లక్షలు పలికింది. మరో ప్లాట్లో చదరపు గజానికి 2.36 లక్షలు, ఇంకో రెండు ప్లాట్లలో గజానికి రూ.2.06 లక్షలు చొప్పున అమ్ముడయ్యాయి. మొత్తంగా సగటున గజానికి రూ.1.79 లక్షల ధర లభించినట్లు అధికారులు తెలిపారు. 16 ప్లాట్ల కోసం 19 మంది బిడ్డర్లు పోటీపడ్డారు.
Land Prices | అదిరిపోతున్న ధరలు
హైదరాబాద్ నగరంలో కొంతకాలంగా భూముల ధరలు భారీగా పలుకుతున్నాయి. గతంలో కోకాపేటలో ప్రభుత్వం వేలంపాట నిర్వహించగా ఎకరం భూమి రూ.200 కోట్ల వరకు పలికింది. ఇటీవల రాయదుర్గంలో ఎకరా భూమి రూ.237 కోట్లకు అమ్ముడయింది. ప్రభుత్వ భూములను దక్కించుకోవడానికి అనేక కంపెనీలు ఆసక్తి చూపుతుండగా.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తోంది.
దీనిని కూడా చదవండి : Mamunur Airport | కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో సీఎం రేవంత్ కీలక చర్చలు..