అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLA MP Age Limit | ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అర్హత వయసును 21 ఏళ్లకు తగ్గించాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. గతంలో రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయసును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారన్నారు. అలాగే ప్రస్తుతం పోటీ వయసును తగ్గించాలన్నారు. ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ, శాసనమండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని తెలిపారు.
ఢిల్లీలో విద్యార్థులపై లాఠీఛార్జీని ఖండిస్తూ నెక్లెస్ రోడ్‌లో టీపీసీసీ (TPCC) ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. యువత సాధించిన ఈ విజయాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవడం లేదన్నారు. పార్టీలకు అతీతంగా అందరు మద్దతు ప్రకటించారని చెప్పారు. అందుకే కేంద్రం దిగొచ్చిందన్నారు. . రాజీనామాతో సరిపెట్టడం కాదు, చనిపోయిన విద్యార్థులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై పెట్టిన కేసులను సోమవారం లోపు కేసులను ఎత్తివేయాలన్నారు.
MLA MP Age Limit | ప్రజా ఉద్యోమానికి తలొగ్గి..
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Goud) మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమానికి మోదీ తలొగ్గారన్నారు. ఏక చిత్రాధిపత్యంకు వ్యతిరేకంగా యావత్ విద్యార్థి లోకం ఏకమైందన్నారు. విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఆయన ఖండించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే జెన్ జీ లో ఒకరు విద్యాశాఖ మంత్రి అవుతారన్నారు.
దేశంలో ఎమ్మెల్యేకు, ఎంపీకి పోటీ చేయడానికి అర్హత వయస్సును 21 సంవత్సరాలకు తగ్గించాలని తీర్మానం చేసి మోడీకి పంపిస్తా
– సీఎం రేవంత్ రెడ్డి https://t.co/bEMBLG6542 pic.twitter.com/kabUOwdJ9v
— Telugu Scribe (@TeluguScribe) July 25, 2026
దీనిని కూడా చదవండి : Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల కోసం.. యూపీఐ ద్వారానే రూ.10 వేలు చెల్లించాలి : మంత్రి పొంగులేటి