అక్షరటుడే, వెబ్‌డెస్క్: Syria Bus Collision | సిరియాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కనీసం 35 మంది మృతి చెందగా, మరో 30 మంది గాయపడ్డారు. తూర్పు సిరియాను రాజధాని డమాస్కస్‌తో అనుసంధానించే కీలకమైన డెయిర్ అజ్ జోర్–డమాస్కస్ జాతీయ రహదారిపై రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Syria Bus Collision | మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
ఈ ప్రమాదంలో పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. సిరియాలో ప్రధాన నగరాలను కలిపే ఈ రహదారిపై తరచూ భారీ వాహనాల రాకపోకలు కొనసాగుతుండటంతో ఇది అత్యంత కీలక రవాణా మార్గంగా గుర్తింపు పొందింది.