Houthi Missile Attacks | సౌదీపై క్షిపణులతో హౌతీల దాడులు

సౌదీ అరేబియాపై యెమెన్​లోని హౌతీలు క్షిపణులతో దాడులు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Houthi Missile Attacks | సౌదీ అరేబియా (Saudi Arabia)పై యెమెన్​లోని హౌతీలు క్షిపణులతో దాడులు చేశారు. దీంతో అరామ్ కో చమురు కంపెనీలో భారీగా మంటలు చెలరేగాయి.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. ఓ వైపు ఇరాన్​, అమెరికా దాడులు కొనసాగుతుండగా.. ఇటీవల యెమెన్​లోని హౌతీలు సౌదీని లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతున్నారు. ఇటీవల సౌదీకి చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చివేశారు. తాజాగా క్షిపణులతో దాడులు చేశారు. ఈ దాడులతో . రియాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని ఇంధన కేంద్రంలో భారీగా మంటలు చెలరేగాయి.

Houthi Missile Attacks | విమాన రాకపోకలకు అంతరాయం

ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో నల్లటి పొగ అలుముకుంది. మరోవైపు హౌతీ బాలిస్టిక్ క్షిపణిని సౌదీ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. దాడుల నేపథ్యంలో రియాద్ ప్రజలకు ప్రభుత్వం తొలిసారి వైమానిక దాడి ముప్పు హెచ్చరిక జారీ చేసింది. ఎయిర్ పోర్టులో విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. యాన్బు, బిషా, తైఫ్, ఫరాసన్లపై దాడులు చేసినట్లు హౌతీలు ప్రకటించారు. సౌదీ కూటమి దాడులకు ప్రతీకారంగానే దాడులు చేశామన్నారు. బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్‌లతో దాడులు చేశామని తెలిపారు.

దీనిని కూడా చదవండి : BMW Accident | బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ బీఎండబ్ల్యూ కారు : ముగ్గురి మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *