అక్షరటుడే, వెబ్‌డెస్క్: Punjab Encounter | పంజాబ్‌లో అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ASI) హత్య కేసులో ఇద్దరు నిందితులలో ఒకరిని పోలీస్ ఎన్కౌంటర్ చేశారు. అమృత్‌సర్‌లోని ముల్చక్కు చెందిన దీపక్ సింగ్ అనే నిందితుడు శుక్రవారం సీనియర్ పోలీసు అధికారి హర్జిత్ సింగ్‌ను, అతని సహాయకుడిని కాల్చి చంపాడు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు. శనివారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో స్కూటర్‌పై వస్తున్న ఇద్దరు అనుమానితులను ఆపమని పోలీసులు సూచించారు. వారు పోలీసులపై కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపగా.. 19 ఏళ్ల దీపక్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మరో నిందితుడు తప్పించుకున్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Punjab Encounter | ఉగ్ర సంబంధాలపై ఆరా..
ఏఎస్సై హత్యకు ఉపయోగించిన 30 బోర్ పిస్టల్, రెండు మ్యాగజైన్లు, ఎనిమిది తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంబంధంపై కూడా ఆరా తీసుస్తున్నారు. చెందిన ఒక ఉగ్రవాది నిందితుడికి డబ్బు ఆఫర్ చేసినట్లు సమాచారం. దీపక్ గతంలో డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు.
దీనిని కూడా చదవండి : Jogipet Agriculture Office Fire | సంగారెడ్డిలో భారీ ప్రమాదం.. జోగిపేట ఏడీఏ ఆఫీస్‌లో ఎగసిపడిన మంటలు.. సబ్సిడీ పరికరాలు, ఫైళ్లు దగ్ధం!