అక్షరటుడే, వెబ్డెస్క్: Jogipet Agriculture Office Fire | సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని వ్యవసాయ శాఖ కార్యాలయ (ADA Office) ఆవరణలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కార్యాలయ ప్రాంగణంలోని రేకుల గోదాంలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగి, వ్యాపించడంతో తీవ్ర కలకలం రేగింది.
Jogipet Agriculture Office Fire | అగ్నికి ఆహుతైన సబ్సిడీ పరికరాలు
ఈ ప్రమాదంలో గోదాంలో భద్రపరిచిన వ్యవసాయ సబ్సిడీ పరికరాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దీనితో పాటు ప్రభుత్వం నుంచి అందే పథకాలు, సబ్సిడీల కోసం రైతులు సమర్పించిన వేలాది అప్లికేషన్ పత్రాలు, ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఆఫీసు ఫర్నీచర్ అగ్నికీలలకు ఆహుతయ్యాయి.
Jogipet Agriculture Office Fire | రంగంలోకి ఫైర్ సిబ్బంది
గోదాం నుంచి ఒక్కసారిగా నల్లటి దట్టమైన పొగలు, మంటలు ఎగసిపడటంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక దళం సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు విచారిస్తున్నారు.