Khairatabad by-election | ఓటమి భయంతోనే సీఎం కోర్టుకెళ్లారు : డీకే అరుణ

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Khairatabad by-election | ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వస్తే ఓడిపోతామనే భయంతోనే సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) కోర్టుకు వెళ్లారని బీజేపీ ఎంపీ డీకే అరుణ (DK Aruna) విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్​ చేశారు.

దానం నాగేందర్​పై హైకోర్టు అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది. అయితే ఉప ఎన్నికలు నిర్వహించకుండా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కాంగ్రెస్​ నాయకురాలు విజయారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆమె గతంలో దానంపై ఎన్నికల పిటిషన్​ వేశారు. దానం నాగేందర్​ అఫిడవిట్​లో తప్పుడు వివరాలు ఇచ్చారని, ఆయన ఎన్నిక చెల్లదని కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​ పెండింగ్​లో ఉంది. ఈ క్రమంలో దీనిపై తీర్పు వచ్చే వరకు ఉప ఎన్నిక నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని విజయారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​ అయ్యే వరకు ఎన్నికలు నిర్వహించమని ఎన్నికల సంఘం సైతం కోర్టుకు తెలిపింది.

Khairatabad by-election | దిగజారుడు రాజకీయాలు

ఈ క్రమంలో ఎంపీ డీకే అరుణ స్పందించారు. ఉప ఎన్నిక వస్తే ఓడిపోతామని రేవంత్​రెడ్డి భయపడుతున్నారని అన్నారు. అందుకే విజయారెడ్డితో పిటిషన్​ వేయించారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్​ఎస్​ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఆ పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.

దీనిని కూడా చదవండి : Hyderabad Water Supply | హైదరాబాద్​వాసులకు అలర్ట్​.. తాగునీటి సరఫరాలో అంతరాయం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *