అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు ప్రాంతాల్లో రేపు తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని జలమండలి (HMWSSB) అధికారులు తెలిపారు. వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
నగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టులోని పైప్లైన్లకు మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ పనులు సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటలకు వరకు కొనసాగనున్నాయి. దీంతో ఈ 36 గంటల పాటు పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు.
Hyderabad Water Supply | అంతరాయం ఏర్పడే ప్రాంతాలు
వనస్థలిపురం, ఆటోనగర్, అల్కాపురి, బీరప్పగడ్డ, హబ్సిగూడ, ఆదిబట్ల, కమ్మగూడ, గుర్రంగూడ, బీఎన్ రెడ్డి నగర్, రామంతాపూర్, వెంకట్‌రెడ్డి నగర్, ఉప్పల్, నాచారం, హెచ్‌ఎంటీ నగర్, తార్నాక, బౌద్ధనగర్, లాలాపేట్ (పాక్షికం), హస్మత్‌పేట్, ప్రకాశ్‌నగర్, మేకలమండి, భోలక్‌పూర్ (పాక్షికం), పద్మారావునగర్, బేగంపేట్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఎంఈఎస్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, లాలాగూడ, అడ్డగుట్ట, పట్టిగడ్డ, నల్లగుట్ట, గౌతమ్‌నగర్, ఫిరోజ్‌గూడ, బన్సీలాల్‌పేట్, రాంగోపాల్‌పేట్, సీతాఫల్‌మండి, మెట్టుగూడ, వైశాలీనగర్, మీర్‌పేట్, బడంగ్‌పేట్, ఏఆర్‌సీఐ, బాలాపూర్, మైసారం, బార్కాస్, ఎన్‌పీఏ, శంషాబాద్, మధుబన్, ప్రశాసన్‌నగర్ ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుంది.
దీనిని కూడా చదవండి : Rahul Gandhi | పోటీకి భయపడ్డ రాహుల్ గాంధీ.. ఎస్పీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు