Asaduddin Owaisi | ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asaduddin Owaisi | ఎంఐఎం (MIM) అధినేత, ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌కు రూ.2 కోట్లు ఇచ్చి.. అడ్వకేట్ ఖాజాను చంపిన రౌడీ షీటర్ బెయిల్‌ తెచ్చుకున్నాడని ఆరోపించారు.

అడ్వొకేట్‌ను చంపిన రౌడీషీటర్‌కు జైలు సూపరింటెండెంట్ సహకరిస్తున్నారని ఒవైసీ అన్నారు. ఆ రౌడీ షీటర్​ ఖాజా మొయినుద్దీన్‌ను హత్య చేశాడని చెప్పారు. అతడు ఇతరులపై సైతం దాడులకు కుట్ర చేస్తున్నాడని ఆయన అన్నారు. అమాయకులపై హత్యలకు పాల్పడే వారిని బహిష్కరించాలని ఎంపీ డిమాండ్​ చేశారు.

Asaduddin Owaisi | ఓట్లు తొలగించే యత్నం

బీజేపీ, సంఘ్ పరివార్ ఫారం 7 ద్వారా ఓటర్ల పేర్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నాయని అసదుద్దీన్​ ఆరోపించారు. తొలగించాల్సిన వ్యక్తి పేరును మాత్రమే పేర్కొంటూ, ఆ ఫారం సమర్పిస్తున్న వ్యక్తి పేరు లేదా వివరాలు లేకుండా ముద్రించిన ఫారం 7లను సమర్పిస్తున్నారని పేర్కొన్నారు. ఒకవేళ తప్పుడు ఫారం 7లు దాఖలు అయితే, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. దీనిని ఆపకపోతే హైదరాబాద్​లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు.

దీనిని కూడా చదవండి : Nizamabad Red Cross Polling | ఉత్సాహంగా సాగుతున్న రెడ్​క్రాస్ ఎన్నికల పోలింగ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *