Nizamabad Red Cross Polling | ఉత్సాహంగా సాగుతున్న రెడ్​క్రాస్ ఎన్నికల పోలింగ్

నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని రెడ్​క్రాస్​ సొసైటీ మేనేజింగ్​ కమిటీ ఎన్నికల పోలింగ్​ జోరుగా కొనసాగుతోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Red Cross Polling | జిల్లా (Nizamabad) కేంద్రంలోని రెడ్​క్రాస్​ సొసైటీ మేనేజింగ్​ కమిటీ ఎన్నికల పోలింగ్​ జోరుగా కొనసాగుతోంది. బస్టాండ్​ పక్కనే ఉన్న హరిచరణ్​ మార్వాడి విద్యాలయంలో ఉదయం 8గంటల నుంచే పోలింగ్​ ప్రారంభమైంది.

Nizamabad Red Cross Polling | 9,826 మంది సభ్యులు.. 29 మంది కంటెస్టెంట్లు..

జిల్లా సహకార అధికారి శ్రీనివాసరావు ఎన్నికల అధికారిగా ఉన్నారు. ఈ సందర్భంగా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. జిల్లా రెడ్​క్రాస్​ సొసైటీలో మొత్తంగా 9,826 మందికి సభ్యత్వం ఉంది. అయితే ఎన్నికల బరిలో 29మంది అభ్యర్థులు ఉన్నారు. వీరు రెండు ప్యానళ్లుగా విడిపోయి ప్రచారం చేశారు. ప్రస్తుతం పోలింగ్​ జోరుగా సాగుతోంది. ఉదయం 10.30 వరకు సుమారు 300 మందికి పైగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3 వరకు పోలింగ్​ జరుగుతుంది. తదనంతరం ఫలితాల వెలువడనున్నాయి.

redred

ఇది కూడా చదవండి: సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *