Nizamabad CCTV Security | నేరరహిత కమిషనరేట్​గా మార్చడానికి కృషి చేస్తున్నాం..: సీపీ సాయిచైతన్య

నేరరహిత కమిషనరేట్​గా మార్చడానికి కృషి చేస్తున్నామని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad CCTV Security | నేరరహిత కమిషనరేట్​గా మార్చడానికి కృషి చేస్తున్నామని సీపీ సాయిచైతన్య(CP Saichaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.

Nizamabad CCTV Security | సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి..

గతంలో నేరాలు, చోరీలు జరిగితే నిందితులను పట్టుకోవడం చాలా కష్టంగా ఉండేదని.. ఎప్పుడైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ప్రారంభమైందో అప్పటి నుంచి నిందితులను పట్టుకోవడం సులభమైందని సీపీ పేర్కొన్నారు. సినిమా థియేటర్లు, బంగారు దుకాణాలు, వస్త్ర వ్యాపారాలు, గ్యాస్ దుకాణాలు, విద్యాసంస్థలు, కాలేజీలు, యూనివర్సిటీ, అపార్ట్​మెంట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు. అందుకోసం ప్రతిఒక్కరూ వారి వ్యక్తిగత ఆడంబరాలకు ఉపయోగించే ఖర్చుల్లో కొద్దిపాటి ఖర్చుతో తమ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. నేరాలు జరిగిన తర్వాత దొంగలను పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. ప్రతిఒక్కరూ సీసీ కెమెరాలపై అవగాహన పెంచుకుని ఏర్పాటు చేసుకోవాలని సీపీ సూచించారు.

 ఇది కూడా చదవండి: ప్రజలు గతంలో ఎప్పుడూ ఫామ్ నింపలేదు.. – ప్రకాశ్ రాజ్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *