Kamareddy Durga Navratri | కొలువుదీరిన దుర్గమ్మ.. తొలి రోజు అంగరంగ వైభవంగా పూజలు

Naresh Chandan

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Durga Navratri | కామారెడ్డి జిల్లా కేంద్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. పట్టణంలోని వివిధ దుర్గామాత మండపాల్లో అమ్మవారు కొలువుదీరడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నవరాత్రుల తొలిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా నిర్వహించారు.

ఉదయం నుంచే అమ్మవారి మండపాల వద్ద భక్తుల సందడి కనిపించింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దుర్గామాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారిని భక్తులకు దర్శనమిచ్చేలా అలంకరించారు. అమ్మవారి దివ్య రూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Kamareddy Durga Navratri | భక్తిశ్రద్ధలతో మాలధారణ

శరన్నవరాత్రుల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలువురు భక్తులు దుర్గామాత మాలధారణ చేపట్టారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారిని స్మరిస్తూ ఆధ్యాత్మిక సాధనకు శ్రీకారం చుట్టారు. నవరాత్రుల తొమ్మిది రోజుల పాటు నియమనిష్ఠలతో ఉపవాసాలు ఆచరిస్తూ అమ్మవారిని పూజిస్తామని భక్తులు తెలిపారు.

మొత్తంగా తొలిరోజు పూజలతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దుర్గామాత మండపాలు భక్తి భావంతో కళకళలాడాయి. అమ్మవారి నామస్మరణలు, పూజా కార్యక్రమాలతో పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *