అక్షరటుడే, వెబ్డెస్క్: SI Extramarital Affair | జిల్లాలో పనిచేస్తున్న ఓ ఎస్సైపై హోంగార్డు సంచలన ఆరోపణలు చేశాడు. తన భారతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించాడు. తనను తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నాడని.. తనకు నాయ్యం చేయాలని వేడుకుంటున్నాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లో చోటు చేసుకుంది.
బాధితుడి కథనం ప్రకారం.. బోధన్ (Bodhan) డివిజన్లోని ఓ మండల ఎస్సై తనను వేధిస్తున్నట్లు హోంగార్డు వీడియో విడుదల చేశాడు. మొదట్లో తాను ఎస్సై ఇంట్లో పని చేశానని చెప్పాడు. అయితే హోంగార్డు అయిన తనతో కాళ్లు ఒత్తించుకునేవాడని, ఇంటిపని, గిన్నెలు తోమడం వంటివి కూడా చేయించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ పని నచ్చకపోవడంతో మానేసినట్లు చెప్పాడు. అనంతరం తనపై ఎస్సై కక్ష పెంచుకొని స్టేషన్లో నిత్యం వేధిస్తున్నాడని ఆరోపించాడు.
SI Extramarital Affair | న్యాయం చేయకపోతే చనిపోతా..
తన భార్యకు తనకు గొడవ జరిగితే పోలీస్ స్టేషన్కు వచ్చిందన్నారు. అయితే తనపై కక్ష గట్టిన ఎస్సై తన భార్యతో అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎస్సై తన భార్యతో ఆరు నెలలుగా వివాహేతర సంబంధం (Extramarital affair) పెట్టుకున్నాడని ఆరోపించాడు. తనను మానసికంగా వేధిస్తున్నాడని వాపోయాడు. తనకు కావాలని బందోబస్తు డ్యూటీలు వేస్తున్నారని చెప్పాడు. మేడారం, ఏడుపాయల జాతరకు పంపించారని చెప్పాడు. ఎస్సై భార్య లేని సమయంలో తన భార్యను ఇంటికి తీసుకు వెళ్తున్నాడని ఆరోపించాడు. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని వీడియో విడుదల చేశాడు. ఈ ఘటన ప్రస్తుతం జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది.
ఇది కూడా చదవండి..: GGH Nizamabad | అరుదైన శస్త్రచికిత్సకు వేదికగా నిలిచిన నిజామాబాద్ జీజీహెచ్
