అక్షరటుడే, కామారెడ్డి : SP Rajesh Chandra | బాధితులకు తక్షణ న్యాయం అందించడమే తమ ప్రథమ కర్తవ్యమని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. మంగళవారం కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.
SP Rajesh Chandra | పెండింగ్ కేసులపై ఆరా
స్టేషన్ పరిసరాలు, రికార్డులు పరిశీలించిన తర్వాత శాంతిభద్రతలు, పెండింగ్ కేసులు, ప్రజా సేవలపై ఎస్పీ చర్చించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడితో మర్యాదగా వ్యవహరించి సమస్యలను వేగంగా పరిష్కరించాలని, దీనివల్ల ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం పెరుగుతుందని అధికారులకు సూచించారు. నమోదైన ప్రతి కేసు దర్యాప్తును నాణ్యతతో పూర్తి చేసి పెండింగ్ కేసులను తగ్గించాలని ఆదేశించారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ అరెస్టులు, ఓటీపీ మోసాలపై గ్రామాలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డయల్-100 కాల్స్‌కు వెంటనే స్పందించి బాధితులకు భరోసా ఇవ్వాలని, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు, రాత్రి గస్తీని పటిష్టం చేయాలని తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ నిబంధనల అమలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ట్రాఫిక్ ఎస్సై చంద్రశేఖర్‌కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మధుసూదన్, టౌన్ ఎస్‌ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Minor Driving | మైనర్ డ్రైవింగ్‌పై సీరియస్.. 283 వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు