అక్షరటుడే, బోధన్: Yedapally Police | ఎడపల్లి మండల పరిధిలోని జానకంపేట్ (Janakampet) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
Yedapally Police | టిప్పర్ ఢీకొనడంతో..
జానకంపేట దర్గా వద్ద ఉదయం కమల అనే మహిళ తన కొడుకుతో బైక్పై నిజామాబాద్ (Nizamabad) వైపు వస్తోంది. అయితే దర్గా సమీపంలోకి రాగానే వెనుక నుంచి టిప్పర్ ఢీకొనడంతో ఆమె బైక్పై నుంచి ఎగిరిపడింది. టిప్పర్ ఆమె తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దర్గా వద్ద ఇరుకైన రోడ్డుపై ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి : S Janaki Passing | గానకోకిల ఎస్. జానకి అమరగానం..ఏడు దశాబ్దాల సంగీత ప్రస్థానం ముగింపు
Janakampet Road Accident, Bodhan News, Edapally News, Telangana Accident, Road Safety, Tipper Accident, Nizamabad News, Telangana News