SIR Process Review | ‘సర్’ ప్రక్రియను విజయవంతం చేయాలి : బొబ్బిలి రామకృష్ణ

జిల్లాలో కొనసాగుతున్న సర్ ప్రక్రియను అర్బన్ పరిధిలో వంద శాతం పూర్తి చేయాలని నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ సూచించారు.

shashi kiran Mottala

​అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: SIR Process Review | జిల్లాలో కొనసాగుతున్న ‘సర్’ ప్రక్రియను అర్బన్ పరిధిలో వంద శాతం పూర్తి చేయాలని నిజామాబాద్ డీసీసీ (DCC Nizamabad) అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) కోరారు. శనివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, డివిజన్ ఇన్​ఛార్జీలు, బీఎల్​ఏలు, సూపర్‌వైజర్లకు సర్ ప్రక్రియపై దిశా నిర్దేశం చేశారు.

SIR Process Review |పీసీసీ చీఫ్​ సొంత నియోజకవర్గంలో..

​బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ.. నిజామాబాద్ అర్బన్ (Nizamabad Urban) పీసీసీ అధ్యక్షుడి సొంత నియోజకవర్గం అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని డివిజన్లకు మెంటర్లను నియమించినట్లు తెలిపారు. డివిజన్లలోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో పార్టీ నాయకులందరూ అందుబాటులో ఉంటూ, ఓటర్లకు ఫారాలు నింపడంలో సహాయపడాలన్నారు. అవసరమైన చోట ప్రత్యేక క్యాంప్​లు నిర్వహించాలని సూచించారు. ప్రతి డివిజన్‌లో ఇంటింటికీ వెళ్లి ఫారాలు సేకరించి, వాటిని పూర్తి చేయడానికి వలంటీర్లను నియమించుకోవాలని పేర్కొన్నారు.

SIR Process Review | ​బాధ్యతాయుతంగా పనిచేయాలి

కార్పొరేటర్లు, పోటీ చేసి ఓడిపోయిన వారు, బీఎల్ఏ సూపర్‌వైజర్లు తమ తమ డివిజన్లలో వలంటీర్లను సమన్వయం చేసుకుంటూ, ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్లకు పూర్తి స్థాయిలో సహాయం అందించాలని రామకృష్ణ సూచించారు. ​ఈ సమావేశంలో సీనియర్ నాయకులు రత్నాకర్, జావీద్ అక్రమ్, అర్బన్ ఈఆర్‌వో (ERO) కో-ఆర్డినేటర్ అబ్దుల్ వహీద్, డీసీసీ ఉపాధ్యక్షుడు రత్నాకర్ గౌడ్, డీసీసీ కార్పొరేషన్ ఉపాధ్యక్షులు విజయ్ పాల్ రెడ్డి, సలీం, కోశాధికారి సకినాల శివ పాల్గొన్నారు.

congrsss1

ఇది కూడా చదవండి: హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *