అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : TPCC Chief | కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కల్పించిన ఉద్యోగాలపై చర్చకు బీఆర్ఎస్తో ఎనీటైం సిద్ధంగా ఉన్నామని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ (Nizamabad) నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద వినాయక ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
TPCC Chief | సవాలు విసిరి తోకముడిచిన బీఆర్ఎస్..
ఉద్యోగాలకు సంబంధించి చర్చిద్దామని సవాల్ విసిరిన బీఆర్ఎస్ నాయకులు అనంతరం తోకముడిచారని టీపీసీసీ చీఫ్ అన్నారు. బీఆర్ఎస్ నేతలవి పసలేని సవాళ్లని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కల్పించిన 70వేల ఉద్యోగాలకు తమ వద్ద రికార్డులు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. చిత్తశుద్ధితో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని ఆయన వివరించారు.
TPCC Chief | కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు..

కల్వకుంట్ల కుటుంబ పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని పీసీసీ చీఫ్ విమర్శించారు. నిరుద్యోగుల ప్రాణాలతో చెలగాటం ఆడి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కాళేశ్వరం కట్టిన రెండున్నరేళ్లలోనే బీటలు వారిందని.. రాష్ట్రంలో ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల అనేది నిపుణుల సూచనల మేరకే జరుగుతుందని ఆయన వివరించారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ నేతలను తెలంగాణ ప్రజలు ఆదరించే స్థితిలో లేరన్నారు.
ఇది కూడా చదవండి..: Crop Bonus | అన్ని పంటలకు బోనస్ ప్రకటించాలి: అర్బన్ ఎమ్మెల్యే