Plastic Free Society | “ప్లాస్టిక్ వద్దు – పర్యావరణమే ముద్దు”.. సత్యశోధక్ పాఠశాలలో అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం

ప్రతి కుటుంబం తమ దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, షాపింగ్‌కు వెళ్లే సమయంలో వస్త్ర సంచులు, కాగితపు సంచులను ఉపయోగించే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Plastic Free Society | పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి విద్యార్థులే నాంది పలకాలని సత్యశోధక్ పాఠశాల ప్రిన్సిపల్ ఆర్. నర్సయ్య పిలుపునిచ్చారు.

అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్​ Nizamabad జిల్లా సిరికొండలోని సత్యశోధక్ పాఠశాలలో జాతీయ హరిత దళం (ఎన్‌జీసీ) ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నియంత్రణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Dharmapuri Arvind Students | గ్రామీణ విద్యార్థుల ప్రతిభకు జాతీయస్థాయిలో గుర్తింపు.. అంతర్జాతీయ వేదికపైకి అడుగులు.. ఛాంపియన్లను అభినందించిన ఎంపీ ధర్మపురి అర్వింద్

Plastic Free Society | దీర్ఘకాలిక ముప్పు

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఆర్. నర్సయ్య మాట్లాడుతూ.. నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన పర్యావరణ సమస్యల్లో ప్లాస్టిక్ కాలుష్యం ఒకటని అన్నారు. ఒక్కసారి వినియోగించి పారేసే ప్లాస్టిక్ సంచులు నేల, నీరు, గాలిని కలుషితం చేయడమే కాకుండా జీవవైవిధ్యానికి, పశుపక్ష్యాదులకు, మానవ ఆరోగ్యానికి దీర్ఘకాలిక ముప్పుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రతి కుటుంబం తమ దైనందిన జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, షాపింగ్‌కు వెళ్లే సమయంలో వస్త్ర సంచులు, కాగితపు సంచులను ఉపయోగించే అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు.

School Kitchen Shed | బడి రుణం.. తమ్ముడి స్మరణం: సిరికొండ జెడ్పీహెచ్‌ఎస్ పూర్వ విద్యార్థి అక్షరార్చన!

Plastic Free Society | విద్యార్థులు అవగాహన కల్పించాలి

పర్యావరణ పరిరక్షణలో చిన్నచిన్న మార్పులే గొప్ప ఫలితాలను అందిస్తాయన్నారు. తమ కుటుంబంతోపాటు సమాజంలో ప్లాస్టిక్ రహిత జీవన విధానంపై విద్యార్థులు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

అనంతరం ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు, ప్రత్యామ్నాయాలపై విద్యార్థులు రూపొందించిన అవగాహన గోడపత్రాలను ప్రిన్సిపల్ ఆవిష్కరించి అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఎన్‌జీసీ ఇన్‌ఛార్జి ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *