Fake status in Social Media | ఫేక్​ స్టేటస్​ పెట్టిన యువకుడు.. అరెస్ట్​ చేసిన పోలీసులు

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Fake status in Social Media | సోషల్​మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం ‘ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అంటూ ఓ యువకుడు ఇన్​స్టాలో ఫేక్​ వీడియో పోస్ట్​ చేశాడు. దీంతో స్పందించిన కామారెడ్డి పోలీసులు (kamareddy police) యువకుడిపై కేసు నమోదు చేశారు.

Fake status in Social Media | పట్టణానికి చెందిన..

పట్టణంలోని రెద్దాన్ రోహిత్ అనే యువకుడు ఇన్‌స్టాలో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు భావోద్వేగ వీడియో పోస్ట్ చేశాడు. విషయం తెలిసిన కామారెడ్డి పట్టణ పోలీసులు వెంటనే అతని ఇంటికి వెళ్లి విచారించారు. విచారణలో అసలు విషయం బయటపడింది. కేవలం వ్యూస్, లైక్స్ కోసమే ఆ వీడియో చేశానని రోహిత్ ఒప్పుకున్నాడు. దాంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) మాట్లాడుతూ.. మీ ఒక్క తప్పుడు పోస్ట్ వల్ల పోలీస్ యంత్రాంగం మొత్తం అత్యవసర పరిస్థితిగా భావించి పరుగులు తీయాల్సి వస్తోందన్నారు. ఇలాంటి నిర్లక్ష్యపూరిత చర్యల వల్ల నిజంగా ఆపదలో ఉన్న వారికి సాయం అందడంలో ఆలస్యం అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

Fake status in Social Media | పోలీసుల విలువైన సమయం..

పోలీసుల విలువైన సమయం మరొకరి ప్రాణాన్ని కాపాడటానికో, ఆపదలో ఉన్న బాధితులకు సాయం చేయడానికో ఉపయోగపడాలన్నారు. సోషల్ మీడియా వ్యూస్ కోసం ప్రాణాలతో ఆడుకోవడం అత్యంత బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. ఇలాంటి కేసుల వల్ల కష్టపడి చదివిన చదువు, బంగారు భవిష్యత్తు ఒక్క పోస్ట్‌తో నాశనం అవుతుందని తెలిపారు. తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టేలా జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రజల భద్రత కోసం పనిచేసే పోలీసుల సమయాన్ని వృథా చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Green Cementech 2026|సిమెంట్ పరిశ్రమలో సరికొత్త ఆవిష్కరణలు.. భాగ్యనగరంలో ‘సీఐఐ’ మెగా ఈవెంట్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *