Single Screen Theatres | పర్సంటేజీ విధానంతోనే సింగిల్​ స్క్రీన్​ థియేటర్ల మనుగడ : ఎగ్జిబిటర్స్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Single Screen Theatres | తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్​ మంగళవారం సమావేశం నిర్వహించింది. సమావేశంలో ఐదు అంశాలపై చర్చించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కోసం రెంట్ పద్ధతి తీసేసి పర్సంటేజ్ షేరింగ్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. రెంట్ విధానంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లపై భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Single Screen Theatres | వారిని ఆదుకోవాలి

హైదరాబాద్‌ (Hyderabad)లో నిర్వహించిన సమావేశంలో నిర్మాతలు చదలవాడ శ్రీనివాస్, శిరీష్ రెడ్డి (Shirish Reddy), సునీల్ నారంగ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పరిశ్రమలో నిర్మాత తండ్రి అయితే.. ఎగ్జిబిటర్​ బిడ్డలాంటివాడన్నారు. ఎగ్జిబిటర్ల పరిస్థితి మెరుగుపడితేనే పరిశ్రమ బాగుంటుందని చెప్పారు. 20 ఏళ్లుగా ఎగ్జిబిటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆరు నెలలుగా పరిస్థితి మరింత దారుణంగా మారిందని పేర్కొన్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

దీనిని కూడా చదవండి : Bharat Karth Accident | సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో నటుడు, కెమెరామన్ దుర్మరణం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *