సినిమాRashmika Mysaa Movie | ‘మైసా’ కోసం రష్మిక కఠిన శిక్షణ.. యాక్షన్ అవతార్‌లో నేషనల్...

Rashmika Mysaa Movie | ‘మైసా’ కోసం రష్మిక కఠిన శిక్షణ.. యాక్షన్ అవతార్‌లో నేషనల్ క్రష్

పాన్ ఇండియా మూవీ ‘మైసా’ కోసం రష్మిక మందన్న బ్యాంకాక్‌లో కఠినమైన యాక్షన్ ట్రైనింగ్ తీసుకుంటూ ఫుల్ డెడికేషన్‌తో పనిచేస్తున్నారు. ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే మంచి బజ్ సృష్టించింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rashmika Mysaa Movie | నేషనల్ క్రష్ ర‌ష్మిక మంధాన‌ (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మైసా’పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. కొత్త దర్శకుడు ర‌వీంద్ర పుల్లే ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్, గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచాయి.

గోండ్ తెగల నేపథ్యంతో హై-ఆక్టేన్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక ఇప్పటివరకు కనిపించని ఇంటెన్స్ లుక్‌లో దర్శనమివ్వనున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆమె ప్రదర్శన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

Rashmika Mysaa Movie | ఫుల్ హార్డ్ వ‌ర్క్..

ఈ పాత్ర కోసం రష్మిక భారీగా కష్టపడుతున్నారు. ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఉన్న ఆమె, కఠినమైన హ్యాండ్-టు-హ్యాండ్ కంబాట్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయి స్టంట్ టీమ్‌తో కలిసి రోజుకు సుమారు 8 గంటల పాటు మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం. ట్రైనింగ్ సమయంలో తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వ్యక్తిగత జీవితంలో Vijay Deverakondaతో వివాహం అనంతరం రష్మిక కొత్త దశలోకి అడుగుపెట్టారు. వివాహానంతరం కొంతకాలం కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వేడుకలు జరుపుకుని, తర్వాత మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు. వ్యక్తిగత, వృత్తి జీవితాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.

Rashmika Mysaa Movie | కేరళలో..

‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఎంపిక కావడం ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. బ్యాంకాక్‌లో ఉన్న కార‌ణంగా ఆమె ముంబైలో జరిగిన INCA అవార్డ్స్ కార్యక్రమానికి హాజరుకాలేకపోయింది. త్వరలో కేరళలో ‘మైసా’ చిత్రానికి సంబంధించిన 16 రోజుల యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి యాండీ లాంగ్‌ Andy Long యాక్షన్ డిజైన్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ‘మైసా’ రష్మిక కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి : Singer Mangli | సింగర్ మంగ్లీని బహిష్కరించాలని ఫిర్యాదు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....