Delhi Capitals Win | వాట్ ఏ మ్యాచ్.. మిల్లర్ మాయాజాలం, థ్రిల్లింగ్ మ్యాచ్‌లో గెలిచిన డీసీ

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi Capitals Win | రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (Royal Challengers Bengaluru) ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ 2026 సీజన్‌లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జరిగిన మ్యాచ్‌తో, ఒకే వేదికపై 100 మ్యాచ్‌లు ఆడిన తొలి జట్టుగా ఆర్‌సీబీ రికార్డు సృష్టించింది.

ఐపీఎల్ (IPL 2026) ప్రారంభమైన 2008 నుంచి ఇదే వేదికను హోమ్ గ్రౌండ్‌గా ఉపయోగిస్తున్న ఆర్‌సీబీ, సరిగ్గా ఏప్రిల్ 18న తన తొలి మ్యాచ్ ఆడింది. 18 ఏళ్ల తర్వాత అదే తేదీన 100వ మ్యాచ్‌ను పూర్తి చేయడం విశేషంగా నిలిచింది. ఈ ఘనతను ఇప్పటివరకు మరే జట్టు సాధించలేకపోయింది.ఈ 100 మ్యాచ్‌లలో ఆర్‌సీబీ 49 విజయాలు సాధించగా, 46 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. నాలుగు మ్యాచ్‌లకు ఫలితం రాలేదు.

Delhi Capitals Win | థ్రిల్లింగ్ మ్యాచ్..

ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆర్‌సీబీ ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. సాల్ట్ (Phil Salt) 38 బంతుల్లో 63 పరుగులు చేసి జట్టుకు బలమైన స్కోరు అందించాడు. టిమ్ డేవిడ్ (Tim David) 26 పరుగులతో సహకరించాడు.ఢిల్లీ బౌలర్లలోఎంగిడి, కుల్‌దీప్ యాద‌వ్, అక్ష‌ర్ ప‌టేల్ తలా రెండు వికెట్లు తీశారు. ముకేష్ కుమార్ ఒక వికెట్ సాధించాడు. ఇక కొత్త బంతితో ఆర్‌సీబీ పేసర్ భువ‌నేశ్వ‌ర్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కి తొలి ఓవర్లోనే షాక్ ఇచ్చాడు. ఓపెనర్ నిస్సంకాని (1)ను ఎల్బీగా ఔట్ చేసిన భువి, తన రెండో ఓవర్లో మరింత దూకుడు చూపించాడు.

Delhi Capitals Win | భువనేశ్వర్​కు 3 వికెట్లు

ఆ ఓవర్లో ఇంప్యాక్ట్ సబ్‌గా వచ్చిన కరుణ్ నాయ‌ర్ (5), అలాగే మంచి ఫామ్‌లో ఉన్న యువ ఆటగాడు స‌మీర్ రిజ్వి(2)లను కూడా పెవిలియన్‌కు పంపించాడు. దీంతో ఢిల్లీ జట్టు ప్రారంభంలోనే భారీ ఒత్తిడిలో పడింది. భువనేశ్వర్ తన స్పెల్‌లో 3 వికెట్లు తీసి ఆర్‌సీబీకి అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. అయితే ఆరంభంలో మూడు వికెట్లు కోల్పోయిన ఢిల్లీని KL Rahul (57), స్ట‌మ్స్ (Tristan Stubbs) (60 నాటౌట్) నిలబెట్టారు.చివ‌రి ఓవ‌ర్ చాలా ఉత్కంఠ‌గా న‌డిచింది. అయితే మిల్ల‌ర్ వ‌రుస‌గా రెండు సిక్స‌ర్స్, ఒక ఫోర్‌తో డిల్లీకి విజ‌యాన్ని అందించాడు. మిల్ల‌ర్ సూప‌ర్భ్ ఇన్నింగ్స్ తో డీసీ మంచి విజ‌యం అందుకుంది.

దీనిని కూడా చదవండి : Rythu Bharosa | రైతులకు గుడ్​న్యూస్​.. 20న రెండో విడత రైతుభరోసా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *