Rythu Bharosa | రైతులకు గుడ్​న్యూస్​.. 20న రెండో విడత రైతుభరోసా

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rythu Bharosa | రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. రెండో విడత రైతు భరోసా నిధులను ఈ నెల 20న విడుదల చేస్తామని తెలిపింది.

రాష్ట్రంలో ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతు భరోసా కింద ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. గతంలో సీజన్​ ప్రారంభానికి ముందు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసేవారు. అయితే యాసంగి సీజన్​కు సంబంధించి రైతు భరోసా ఆలస్యం అయింది. తొలి విడత నిధులను మార్చి 22న ప్రభుత్వం విడుదల చేసింది. తొలి విడతలో ఎకరంలోపు ఉన్న రైతులకు డబ్బులు పడ్డాయి. అలాగే ఎకరం కంటే భూమి ఎక్కువగా ఉన్న వారికి ఎకరం డబ్బులు పడ్డాయి. మొత్తం 1.50 కోట్ల ఎకరాలకు రూ.3,590 కోట్లు జమ అయ్యాయి.

Rythu Bharosa | రూ.5,653 కోట్లు

రైతు భరోసా రెండో విడత నిధులను 20 రోజుల్లో విడుదల చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) గతంలో ప్రకటించారు. ఈ క్రమంలో ఈ నెల 20న భూపాలపల్లి జిల్లా కాటారం బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి రైతు భరోసా విడుదల చేయనున్నారు. మొత్తం 45,11,947 మంది రైతులకు రూ.5,653 కోట్ల నిధులు జమ చేయనున్నారు. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : Singer Mangli | సింగర్ మంగ్లీని బహిష్కరించాలని ఫిర్యాదు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *