అక్షరటుడే, వెబ్డెస్క్ : Heavy Rain Alert | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు. ఉత్తర, పశ్చిమ తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణం కాస్తా చల్లబడింది. బుధవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతుందని అధికారులు తెలిపారు.
Heavy Rain Alert | ఈ జిల్లాలకు అలెర్ట్
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మంచిర్యాల, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడా తీవ్రమైన ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉంది.
దీనిని కూడా చదవండి : ACB Trap | స్టేషన్ బెయిల్ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై