అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Virat Kohli | భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఏ జెర్సీ వేసుకున్నా తన బ్యాటింగ్ క్లాస్ మారదని మరోసారి నిరూపిస్తున్నాడు. సాధారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఎరుపు జెర్సీలో అద్భుతాలు చేసే కోహ్లీ, గ్రీన్ జెర్సీలోనూ సమాన స్థాయిలో రాణించాడు. ఇప్పటివరకు ఆకుపచ్చ జెర్సీలో 15 ఇన్నింగ్స్‌లు ఆడిన అతడు 142 స్ట్రైక్ రేట్‌తో 522 పరుగులు నమోదు చేశాడు. ఇందులో ఐదు అర్ధశతకాలు, ఒక శతకం కూడా ఉన్నాయి. అదే సమయంలో 32 ఫోర్లు, 24 సిక్సర్లతో అభిమానులను అలరించాడు.
Virat Kohli | చెత్త రికార్డ్..
కోహ్లీ గ్రీన్ జెర్సీలో ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్ 2016 ఐపీఎల్ సీజన్‌లో నమోదైంది. ఆ సీజన్‌లో మొత్తం 973 పరుగులతో అద్భుత ఫామ్‌లో ఉన్న కోహ్లీ, గుజరాత్ లయన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఏబీ డివిలియర్స్ (AB de Villiers)తో కలిసి ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపిస్తూ, కేవలం 55 బంతుల్లో 109 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ 144 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడం విశేషం. గ్రీన్ జెర్సీలో ఆ జట్టుకు ఇది అతిపెద్ద విజయం. అయితే 2013 నుంచి 2019 వరకు ఈ జెర్సీలో అదరగొట్టిన కోహ్లీ, ఆ తర్వాత కొంత కాలం ఫామ్ కోల్పోయాడు. ముఖ్యంగా 2021 నుంచి 2024 మధ్య కాలంలో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై వరుసగా 5, 0, 0, 18 పరుగులతో నిరాశపరిచాడు.
Virat Kohli | హాఫ్ సెంచరీతో..
కోహ్లీ 2025 సీజన్‌లో మళ్లీ తన పాత లయను అందుకున్నాడు. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)పై మ్యాచ్ విన్నింగ్ అర్ధ శతకం సాధించి జట్టుకు విజయం అందించాడు. ఇక ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals))తో జరిగిన మ్యాచ్‌లో కూడా రెండు అద్భుత షాట్లతో మంచి టచ్‌లో కనిపించిన కోహ్లీ, 19 పరుగుల వద్ద ఎంగిడి బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ప్రస్తుతం 2026 ఐపీఎల్ సీజన్‌లో కోహ్లీ ప్రదర్శన ఆసక్తికరంగా మారింది. టోర్నీలో టాప్ రన్ స్కోరర్లల ఒకడిగా కొనసాగుతున్న అతడు, తన స్ట్రైక్ రేట్ పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌ల్లో 158 స్ట్రైక్ రేట్‌తో 246 పరుగులు సాధించి రెండు అర్ధ శతకాలు నమోదు చేశాడు.
దీనిని కూడా చదవండి : YS Jagan | చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర విమర్శలు.. ప్రశ్నిస్తే దేశద్రోహమా అంటూ ఆగ్రహం

