అక్షరటుడే, వెబ్‌డెస్క్:Prince Yadav Kohli | ఐపీఎల్ 2026 (IPL 2026)లో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ ప్రిన్స్ యాదవ్, క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహానే ఉపయోగించి ఆయన్నే డకౌట్ చేయడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు 9 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)పై విజయం సాధించింది.
Prince Yadav Kohli | విరాట్ భయ్యాను కలిసి బౌలింగ్ గురించి సలహా
మ్యాచ్ అనంతరం మాట్లాడిన ప్రిన్స్ యాదవ్ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. “గత మ్యాచ్ తర్వాత నేను విరాట్ భయ్యాను కలిసి బౌలింగ్ గురించి సలహా అడిగాను. అప్పుడు ఆయన ‘బంతి ఒక లెంత్ వద్ద స్వింగ్ అవుతుంటే దాన్ని మార్చకు.. అదే లెంత్‌ను కొనసాగించు’ అని చెప్పారు” అని వెల్లడించాడు. అదే టిప్‌ను ఈ మ్యాచ్‌లో కోహ్లీపై ప్రయోగించినట్లు తెలిపాడు.
Prince Yadav Kohli | కోహ్లీకి ఇబ్బందులు..
కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో బంతి స్వింగ్ అవుతుండటంతో ప్రిన్స్ పదేపదే ఒకే లెంత్‌లో బంతులు వేస్తూ ఒత్తిడి పెంచాడు. చివరకు రెండో బంతికే కోహ్లీ బ్యాట్, ప్యాడ్ మధ్య గ్యాప్‌లోంచి బంతిని దూసుకెళ్లేలా చేసి క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ దృశ్యం చూసి స్టేడియంలోని అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఛేజ్ మాస్టర్‌గా పేరుగాంచిన కోహ్లీకి ఇది చేదు జ్ఞాపకంగా మారింది. లక్ష్య ఛేదనలో ఆయన డకౌట్ కావడం దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. 213 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి కోహ్లీ వికెట్ ప్రారంభంలోనే కోల్పోవడం పెద్ద దెబ్బగా మారింది. అదే మ్యాచ్ గమనాన్ని పూర్తిగా లక్నో వైపు తిప్పింది.
Prince Yadav Kohli | ఆ తప్పు తర్వాత నా ఫోకస్ దెబ్బతినకుండా చూసుకున్నాను
ప్రిన్స్ యాదవ్‌కు ఈ మ్యాచ్ మరింత ప్రత్యేకంగా మారింది. అంతకుముందు ఫీల్డింగ్ సమయంలో ఒక చిన్న మిస్ ఫీల్డ్ చేసిన అతను, వెంటనే తేరుకుని తర్వాతి బంతికే జాకబ్ బెతెల్ క్యాచ్ పట్టి తన తప్పును సరిదిద్దుకున్నాడు. “ఆ తప్పు తర్వాత నా ఫోకస్ దెబ్బతినకుండా చూసుకున్నాను” అని ప్రిన్స్ తెలిపాడు. మొత్తం మ్యాచ్‌లో మూడు కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు లక్నో ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. అతడు 111 పరుగులతో మెరుపు సెంచరీ సాధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. లక్నో జట్టు నిర్ణీత 19 ఓవర్లలో 209/3 పరుగులు చేయగా, ఆర్‌సీబీ 203 పరుగులకే పరిమితమైంది. మ్యాచ్ మధ్యలో వర్షం ఆటంకం కలిగించినప్పటికీ, లక్నో బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి విజయాన్ని కాపాడుకున్నారు. వరుసగా ఆరు పరాజయాల తర్వాత లక్నోకు వచ్చిన ఈ విజయం జట్టుకు భారీ ఊరటనిచ్చింది.
ఇది కూడా చదవండి..: Indian Cricket Schedule | ఐపీఎల్ తర్వాత టీమిండియా షెడ్యూల్ బిజీ బిజీ.. మహిళలు, అండర్-19 జట్లకు కూడా కీలక టోర్నీలు

