అక్షరటుడు వెబ్‌డెస్క్:TVK Government Formation| తమిళనాడులో అధికారం చేపట్టేందుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ (మద్దతు) ప్రస్తుతానికి టీవీకే పార్టీకి లేదని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు లోక్‌భవన్ వర్గాలు గురువారం ఒక ప్రకటన విడుదల చేశాయి. 24 గంటల వ్యవధిలోనే విజయ్ రెండోసారి గవర్నర్‌తో భేటీ కావడం గమనార్హం.
TVK Government Formation|గవర్నర్ – విజయ్ మధ్య రెండోసారి చర్చలు..
ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బుధవారం జరిగిన చర్చల కొనసాగింపుగా, గురువారం లోక్‌భవన్‌కు రావాల్సిందిగా విజయ్ను గవర్నర్ ఆహ్వానించారు. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మెజారిటీ నిరూపణపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మద్దతు పత్రాలు విజయ్ వద్ద లేవని గవర్నర్ ఈ సందర్భంగా వివరించినట్లు తెలుస్తోంది.
TVK Government Formation|చట్టపరంగా పోరాడడానికి సిద్దం..
మరోవైపు, గవర్నర్ తీరుపై టీవీకే వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తమ వద్ద ఉన్న మద్దతును (మైనారిటీ వాదన) అంగీకరించేలా గవర్నర్‌పై ఒత్తిడి తెచ్చేందుకు తాము చట్టపరంగా పోరాడతామని పార్టీ వర్గాలు సంకేతాలిచ్చాయి. న్యాయపరంగా ఈ వ్యవహారాన్ని సవాలు చేసే హక్కు తమకు ఉందని విజయ్ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
TVK Government Formation|ట్విస్ట్ ఇచ్చిన వామపక్షాలు..
ఈ రాజకీయ సంక్షోభంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే కూటమిలో ఉన్న సీపీఐ, సీపీఐ(ఎం) , విదుతలై చిరుతైగళ్ కచ్చి (VCK) పార్టీలు విజయ్‌కు మద్దతు ఇచ్చే అంశంపై చర్చలు జరిపాయి. సీట్ల బదిలీకి సంబంధించి ఈ మూడు పార్టీల నేతలు గురువారం ఉదయం ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌తో భేటీ అయ్యారు. అయితే, తమ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా సొంతంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను స్టాలిన్ వారికి ఇచ్చినట్లు సమాచారం.
ఈ మద్దతు గనుక విజయ్‌కు లభిస్తే, తమిళనాడు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Telangana Law Order| హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్.. అందుకే రాష్ట్రంలో ఈ దారుణాలు: కేటీఆర్

