అక్షరటుడే వెబ్డెస్క్: Advanced PET CT Scanner | హైదరాబాద్లోని ( Hyderabad ) సిటిజెన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ , అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (AOI) వైద్య సేవల్లో మరొక కీలక ముందడుగు వేశాయి. క్యాన్సర్ బాధితులకు అత్యంత ఖచ్చితత్వంతో కూడిన చికిత్స అందించేందుకు గాను Siemens Healthineers సంస్థకు చెందిన బయోగాఫ్ హొరైజన్ (‘Biograph Horizon ) PET/CT’ అధునాతన స్కానింగ్ పరికరాన్ని ఇక్కడ అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ పరికరం ద్వారా క్యాన్సర్ శరీరంలో ఎంతవరకు విస్తరించిందో ఖచ్చితంగా తెలుసుకోవడం, సరైన చికిత్సా విధానాన్ని రూపొందించడం , చికిత్సకు రోగి శరీరం ఎలా స్పందిస్తుందో పర్యవేక్షించడం వైద్యులకు సులభతరం కానుంది.
Advanced PET CT Scanner | రోగుల సౌకర్యానికి ప్రాధాన్యత..
ఈ నూతన PET/CT పరికరం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్, న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ల వంటి క్లిష్టమైన వ్యాధులకు కూడా ప్రత్యేక స్కాన్లు చేయవచ్చు. స్కానింగ్ సమయంలో రోగులపై రేడియేషన్ ప్రభావం తక్కువగా ఉండేలా, అలాగే పరీక్ష పడుకునే బెడ్పై గరిష్ఠంగా 227 కిలోగ్రాముల బరువు ఉన్న రోగులు కూడా హాయిగా స్కానింగ్ చేయించుకునేలా దీనిని రూపొందించారు. శరీరంలోని జీవక్రియల సమాచారాన్ని, శరీర నిర్మాణ వివరాలతో కలిపి విశ్లేషించడం వల్ల ప్రతీ రోగికి వారి ఆరోగ్య పరిస్థితికి తగినట్లుగా ప్రత్యేక చికిత్సా ప్రణాళికను సిద్ధం చేయడానికి ఈ డేటా ఎంతగానో ఉపయోగపడుతుంది.
Advanced PET CT Scanner | సాంకేతిక విప్లవం..
ఈ అధునాతన సాంకేతికత ప్రవేశపెట్టడంపై రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సౌత్) డాక్టర్ ప్రభాకర్ పలచర్ల , CTSI చైర్మన్ దిలీప్ మంగ్సులి హర్షం వ్యక్తం చేశారు. వైద్యరంగంలో అధునాతన ఆవిష్కరణలను, నిపుణులైన డాక్టర్ల నైపుణ్యంతో జోడించి రోగులకు మెరుగైన, సానుభూతితో కూడిన నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని వారు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Kamareddy Red Cross | కామారెడ్డి రెడ్క్రాస్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం