అక్షరటుడే వెబ్‌డెస్క్: Chennai Airport Project | చెన్నై నగరానికి రెండో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసే దిశగా తమిళనాడు సర్కార్ కసరత్తు వేగవంతం చేసింది. గతంలో వివాదాస్పదంగా మారిన పరందూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ప్రాజెక్టును అధికారంలోకి వచ్చిన తర్వాత విజయ్ ( Vijay ) ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా రెండు ప్రాంతాలను షార్ట్ లిస్ట్ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Chennai Airport Project | ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి సిఫార్సు..
చెన్నై మెట్రోపాలిటన్ ఏరియా (CMA) అవసరాలను తీర్చేందుకు సరికొత్త ప్రాంతాల కోసం చేపట్టిన అన్వేషణలో కేవలం వారంలోపే రెండు ప్రదేశాలను ఖరారు చేశారు. ఇందులో భాగంగా మానెల్లోర్ (Manellore), చేయ్యూర్ (Cheyyur) ప్రాంతాలను కొత్త ఎయిర్‌పోర్టు కోసం పరిశీలిస్తున్నారు. చెన్నైకి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో మానెల్లోర్ ఉండగా, చేయ్యూర్ దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి సాంకేతిక అనుకూలత, కనెక్టివిటీ, భూమి లభ్యత వంటి అంశాలపై అధ్యయనం చేయాలని కోరుతూ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది.
Chennai Airport Project | రద్దు వెనుక కారణాలు..
రైతులు, వ్యవసాయ భూములు, జలవనరులు, నివాస ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతోనే పరందూర్ ప్రాజెక్టును రద్దు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అభివృద్ధి పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయకూడదని, తక్కువ నష్టం జరిగే ప్రాంతాలను ఎంచుకోవడమే తమ ప్రభుత్వ విధానమని అసెంబ్లీలో పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో భారీగా భూసేకరణ జరిగిందంటూ విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నప్పటికీ, స్థానిక ప్రజల ప్రయోజనాలకే తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సర్కార్ స్పష్టం చేస్తోంది.
ఇది కూడా చదవండి: NRI Policy | ఎన్ఆర్ఐ పాలసీ తీసుకు రావాలి