Gold Smuggling | ఫ్లోర్ స్ప్రింగ్​లో బంగారం స్మగ్లింగ్​.. రూ.4 కోట్ల విలువైన గోల్డ్​ సీజ్​

ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్​ అధికారులు రూ.4 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Smuggling | గోల్డ్​ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త దారుల్లో విదేశాల నుంచి బంగారం అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇటీవల గీజర్​లో బంగారం దాచి తెచ్చిన వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఫ్లోర్​ స్ప్రింగ్​లో తరలిస్తున్న పసిడిని డీఆర్​ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం (Delhi International Airport)లో సోమవారం ఉదయం డీఆర్​ఐ అధికారులు రూ.4 కోట్ల విలువైన బంగారం సీజ్​ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ఒక భారతీయ ప్రయాణికుడిని కస్టమ్స్​ అధికారులు తనిఖీ చేశారు. అతడి బ్యాగేజీలోని ఫ్లోర్​ స్ప్రింగ్​లు అనుమానాస్పదంగా కనిపించడంతో ఓపెన్​ చేసి చూశారు. అందులో 3.2 కిలోల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం విలువ రూ.4.03 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.

Gold Smuggling | కేసు నమోదు

నిందితుడు అధికారులకు చిక్కకుండా ఉండేందుకు ఫ్లోర్​ స్ప్రింగ్​లో బంగారు కడ్డీలను దాచాడు. డోర్లు అటోమేటిక్​గా మూసుకోవడానికి ఫ్లోర్​ స్ప్రింగ్​లు పని చేస్తాయి. వీటిలో మొత్తం బంగారం నింపేసి నిందితుడు తీసుకొచ్చారు. అధికారులు అతడిని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో రహస్యంగా తరలిస్తున్న బంగారం దొరికింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. కస్టమ్స్ చట్టం, 1962 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై హత్యాయత్నం.. నిందితులను వదిలిపెట్టమన్న మహారాష్ట్ర సీఎం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *