Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై హత్యాయత్నం.. నిందితులను వదిలిపెట్టమన్న మహారాష్ట్ర సీఎం

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన హత్యాయత్నాన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన హత్యాయత్నాన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (CM Devendra Fadnavis) తీవ్రంగా ఖండించారు. ముంబై పోలీసులు ఈ కాల్పుల ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణించారని చెప్పారు. ఇప్పటికే కొంతమందిని గుర్తించినట్లు తెలిపారు.

టైగర్ ష్రాఫ్‌పై జరిగిన ఈ కాల్పుల ఘటనలో నిందితులు ఎవరైనా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ పని చేసింది ముఠా కావచ్చు, వ్యక్తి కావచ్చు ఎవరినీ వదిలిపెట్టబోమని, వారు ఎక్కడ దాక్కున్నా ముంబై పోలీసులు వారిని పట్టుకుంటారని తెలిపారు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడితే, ఎలా దారిలోకి తీసుకురావాలో ముంబై పోలీసులకు బాగా తెలున్నారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ కుట్రలను నడిపిస్తున్న సూత్రధారులను కూడా పట్టుకుంటామని ఆయన చెప్పారు.

Tiger Shroff | లారెన్స్​ బిష్ణోయ్​పై..

లారెన్స్ బిష్ణోయ్‌ను అదుపులోకి తీసుకునేందుకు ఇప్పటికే తాము అభ్యర్థన పంపామని ఫడ్నవీస్ తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా సరే, నేరస్థులను వెతికి పట్టుకోగల సామర్థ్యం ముంబై పోలీసులకు ఉందన్నారు. ఈ ఘటనలో నేరుగా పాల్గొన్న వారిని అరెస్టు చేయడంతోనే దర్యాప్తు ముగియదని చెప్పారుఉ. ఆదేశాలు జారీ చేస్తున్న సూత్రధారులను కూడా పట్టుకుంటామని స్పష్టం చేశారు.ఈ కాల్పుల ఘటన ఆదివారం సాయంత్రం ముంబైలోని జుహు ప్రాంతంలో జరిగింది. సుమారు 7 గంటలకు టైగర్​ ష్రాఫ్‌ ఫుట్‌బాల్ క్లబ్ నుంచి కారులో బయలుదేరుతుండగా, గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

ఇది కూడా చదవండి..: Tiger Shroff Firing | టైగర్ ష్రాఫ్‌ కాన్వాయ్‌పై కాల్పులు.. బాలీవుడ్‌లో కలకలం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *