CJP Leaders Bail | సీజేపీ నేతల బెయిల్ విచారణ.. మెజిస్ట్రేట్‌కు చంపుతామని మెసేజ్

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు అశుతోష్ రంకా , సౌరవ్ దాస్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సమయంలో స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ (SEM)కి హత్య బెదిరింపులు రావడం ఢిల్లీలో తీవ్ర కలకలం రేపింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:  CJP Leaders Bail | కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు అశుతోష్ రంకా , సౌరవ్ దాస్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సమయంలో స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ (SEM)కి హత్య బెదిరింపులు రావడం ఢిల్లీలో తీవ్ర కలకలం రేపింది. మెజిస్ట్రేట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు అపరిచిత వ్యక్తులపై నాన్-కాగ్నిజబుల్ రిపోర్ట్ (NCR) నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

CJP Leaders Bail | కావాలనే ఆలస్యం చేస్తున్నారు..

మెజిస్ట్రేట్‌కు వచ్చిన బెదిరింపుల పేరుతో విచారణను కావాలనే పక్కదోవ పట్టించారని, తమ నేతలకు బెయిల్ రాకుండా కొందరు కుట్ర పన్నుతున్నారని సీజేపీ తీవ్రంగా మండిపడింది. ఈ పరిణామంపై సీజేపీ లీగల్ సెల్ చీఫ్ రత్నా సింగ్ మాట్లాడుతూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము ఉదయం నుంచే కోర్టు వద్ద వేచి చూస్తున్నామని, మధ్యాహ్నం 12 గంటలకు విచారణ జరుగుతుందని చెప్పారని తెలిపారు. అన్ని వెరిఫికేషన్ ప్రక్రియలు పూర్తయినప్పటికీ, మెజిస్ట్రేట్ సాయంత్రం 5 గంటల వరకు కోర్టు రూమ్‌లోకి రాలేదని ఆరోపించారు.

బెయిల్ పిటిషన్‌ను మెరిట్స్ ఆధారంగా విచారించకుండా, కేవలం ఆ బెదిరింపు మెసేజ్ చుట్టూనే చర్చను తిప్పారని రత్నా సింగ్ మండిపడ్డారు. గత 4 రోజులుగా కోర్టుకు రాని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సోమవారం అకస్మాత్తుగా హాజరుకావడం, వచ్చిన కొద్దిసేపటికే మెజిస్ట్రేట్ బెదిరింపుల అంశాన్ని తెరపైకి తేవడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆమె విమర్శించారు. తమ నేతల విడుదలను అడ్డుకోవడానికే ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందని ఆరోపించారు.

CJP Leaders Bail | అరెస్ట్ నేపథ్యం..

జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపారనే ఆరోపణలతో అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లను ఢిల్లీ ( Delhi ) పోలీసులు గత వారం అరెస్ట్ చేసి 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. వీరికి సంబంధించిన బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు రాగా.. విచారణ ప్రారంభమైన కేవలం ఐదు నిమిషాలకే తనను చంపేస్తామంటూ ఓ మెసేజ్ వచ్చిందని మెజిస్ట్రేట్ స్వయంగా కోర్టులో వెల్లడించడం ప్రస్తుతం రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి:  Airtel Voice Plans | ఎయిర్‌టెల్ నుంచి వాయిస్ ప్లాన్లు.. డేటా అవసరంలేనివారికి ప్రయోజనం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *