అక్షరటుడే, వెబ్డెస్క్: Airtel Voice Plans | టెలికాం రంగ దిగ్గజ కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ (Airtel) తన వినియోగదారులకోసం మÖడు కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. కేవలం ఫోన్ మాట్లాడుకునే వారి కోసం రూ.185, రూ.203, రూ.206 ధరలతో వీటిని తీసుకువచ్చింది. మొబైల్ డాటా అవసరం లేనివారికి ఇవి ప్రయోజకరంగా ఉండనున్నాయి.
Airtel Voice Plans | ట్రాయ్ గడువుకు ముందే..
వినియోగదారుల కోసం డేటాతో సంబంధం లేకుండా వాయిస్ ప్లాన్లను అందుబాటులో ఉంచాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. దీనికి అక్టోబర్ 21ని గడువుగా నిర్దేశించింది. కస్టమర్లు తాము ఏమాత్రం ఉపయోగించని బండిల్డ్ డేటా సేవల కోసం బలవంతంగా అదనపు డబ్బులు చెల్లించవలసిన అవసరాన్ని తగ్గించడం ట్రాయ్ ఉద్దేశం. అయితే గడువుకుముందే ఎయిర్‌టెల్ వాయిస్, ఎస్సెమ్మెస్ ప్లాన్లను తీసుకురావడం గమనార్హం. తద్వారా ట్రాయ్ నిబంధనలను పాటించిన మొట్టమొదటి ప్రధాన టెలికాం సంస్థగా ఎయిర్‌టెల్ నిలిచింది.
Airtel Voice Plans | ప్లాన్ల వివరాలు..
28 రోజుల వ్యాలిడిటీతో రూ.185 ప్లాన్ ను తీసుకువచ్చింది. 30 రోజుల వ్యాలిడిటీ రూ.203 ప్లాన్‌ను, క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీతో రూ.206 ప్లాన్ ను ప్రవేశపెట్టింది. అన్ని ప్లాన్లలోనూ దేశవ్యాప్తంగా ఏ నెట్వర్క్‌కైనా అపరిమిత కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు. 300 ఉచిత ఎస్సెమ్మెస్‌లూ లభిస్తాయి. ఉచిత హలో ట్యూన్స్ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు. డాటా అవసరంలేనివారు, ఫీచర్ ఫోన్లు ఉపయోగించేవారికి ఈ కొత్త ప్లాన్లు ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ మూడు ప్లాన్లూ ఎయిర్‌టెల్ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో లభిస్తాయి.
ఇది కూడా చదవండి..: FII Investment Outflows | ఎఫ్ఐఐలు తిరిగొచ్చేదెప్పుడో?.. ఆరేళ్లలో రూ. 14.5 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ