ASUS MSME Partnership | MSMEల కోసం ఆసుస్ సరికొత్త భాగస్వామ్యం.. మెంటర్‌గా రాజీవ్ తల్పురేజా

చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) వ్యాపారాలకు మరింత అండగా నిలిచేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం 'ఆసుస్ ఇండియా' (ASUS India) కీలక నిర్ణయం తీసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: ASUS MSME Partnership | చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) వ్యాపారాలకు మరింత అండగా నిలిచేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం ‘ఆసుస్ ఇండియా’ (ASUS India) కీలక నిర్ణయం తీసుకుంది. తమ ‘ఎక్స్‌పర్ట్ సిరీస్’ (Expert Series) పీసీల ద్వారా వ్యాపార వర్గాలకు ‘టెన్షన్-ఫ్రీ’ అనుభవాన్ని అందించేందుకు.. ప్రముఖ ఎంఎస్ఎంఈ నిపుణుడు, ‘క్వాంటమ్ లీప్’ వ్యవస్థాపకుడు రాజీవ్ తల్పురేజాను బ్రాండ్ మెంటర్‌గా నియమించింది.

భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈ రంగం కీలకపాత్ర పోషిస్తోందని, ఈ నేపథ్యంలో వ్యాపార యజమానులు టెక్నికల్ సమస్యల నుంచి బయటపడి పూర్తిస్థాయిలో వృద్ధిపై దృష్టి పెట్టేలా ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని ఆసుస్ ప్రకటించింది.

ASUS MSME Partnership | సమస్య ఎక్కడ ఉందంటే..

చిన్న వ్యాపారులు, నిపుణులకు ‘బిజినెస్ గ్రేడ్’ ల్యాప్‌టాప్‌ల అవసరం ఎంతైనా ఉన్నప్పటికీ.. చాలా మందికి మార్కెట్‌లో అలాంటి ప్రత్యేక ఆప్షన్లు ఉన్నట్లు తెలియడం లేదని ఆసుస్ గతంలోనే గుర్తించింది. సాధారణ రిటైల్ మార్కెట్లలో లభించే సాధారణ ల్యాప్‌టాప్‌లనే చాలామంది కొనుగోలు చేస్తుంటారు. కానీ వ్యాపారాలకు మన్నిక, హై పెర్ఫార్మెన్స్, సెక్యూరిటీ, అప్‌గ్రేడబిలిటీ వంటి అంశాలు చాలా ముఖ్యం. ఈ లోపాన్ని సరిదిద్దేందుకే ఆసుస్ తన ‘ఎక్స్‌పర్ట్ సిరీస్’ ల్యాప్‌టాప్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇవి తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం పనిచేస్తూ, వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూస్తాయి.

ASUS MSME Partnership | పరిశీలన తర్వాతే ఒప్పందం..

ఈ భాగస్వామ్యం కేవలం ఒకరోజులో కుదిరింది కాదు. దీని వెనుక ఏడాదికి పైగా చర్చలు జరిగాయి. రాజీవ్ తల్పురేజా నేతృత్వంలోని క్వాంటమ్ లీప్ బృందం.. ఎలాంటి ఒప్పందానికి రాకముందే ఆసుస్ ఎక్స్‌పర్ట్ సిరీస్ మెషీన్‌లను తమ సొంత సిబ్బందిపై ఉపయోగించి పరీక్షించింది. అంతేకాకుండా తమ కమ్యూనిటీలో స్వయంగా సర్వే నిర్వహించగా.. వ్యాపారులకు సరైన బిజినెస్ పీసీలపై అవగాహన లేదనే విషయాన్ని వారు కూడా గుర్తించారు. ఈ సుదీర్ఘకాలిక భాగస్వామ్యం ద్వారా టెక్నాలజీ అనేది ఒక ‘ఖర్చు’ కాదని, భవిష్యత్తు కోసం చేసే ‘పెట్టుబడి’ అని రాజీవ్ తల్పురేజా ఎంఎస్ఎంఈలకు అవగాహన కల్పిస్తారు. అలాగే, వ్యాపార వర్గాల అవసరాలను ఆసుస్ సంస్థకు ఎప్పటికప్పుడు చేరవేసే వారధిలా వ్యవహరిస్తారు.

ASUS MSME Partnership | రాజీవ్ తల్పురేజా ఏమన్నారంటే..

ఆసుస్ కమర్షియల్ పీసీ బిజినెస్ (ఇండియా, శ్రీలంక, నేపాల్) వైస్ ప్రెసిడెంట్ దినేష్ శర్మ మాట్లాడుతూ.. “భారతీయ ఎంఎస్ఎంఈలను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దాలనేదే మా లక్ష్యం. ఏఐ (AI) యుగంలో పీసీలు వ్యాపార విజయానికి ప్రధాన వనరుగా మారుతున్నాయి. అందుకే ఎంఎస్ఎంఈల కోసం అత్యుత్తమ సెక్యూరిటీ, హై-పెర్ఫార్మెన్స్ కలిగిన ఆసుస్ ఎక్స్‌పర్ట్ సిరీస్ పీసీలను అందిస్తున్నాం” అని తెలిపారు.

క్వాంటమ్ లీప్ వ్యవస్థాపకుడు రాజీవ్ తల్పురేజా మాట్లాడుతూ.. “గత కొన్నేళ్లుగా ఎన్నో బ్రాండ్లు నన్ను సంప్రదించినా వాటన్నింటికీ నో చెప్పాను. కానీ, ఆసుస్ నన్ను ప్రమోట్ చేయమని అడగలేదు, అసలు ఎంఎస్ఎంఈలకు ఏం కావాలనేది అడిగింది. మా సొంత టీమ్‌తో ఆసుస్ ల్యాప్‌టాప్‌లను వాడి చూసిన తర్వాతే ఈ ఒప్పందానికి ఒప్పుకున్నాను. టెక్నాలజీని ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూసేలా వ్యాపార యజమానులకు సహాయం చేయడమే నా బాధ్యత” అని పేర్కొన్నారు.

ఎంటర్‌ప్రైజ్-గ్రేడ్ సెక్యూరిటీ, సులభమైన రిమోట్ మేనేజ్‌మెంట్, అద్భుతమైన మన్నికతో కూడిన ఆసుస్ ఎక్స్‌పర్ట్ సిరీస్ పరికరాలు.. హైబ్రిడ్ వాతావరణంలో ఎంఎస్ఎంఈల ఐటీ పనులను సులభతరం చేసి, ఉత్పాదకతను (Productivity) పెంచడంలో ఎంతగానో సహకరిస్తాయి.

ఇది కూడా చదవండి: SIR Notice Process | ఎస్ఐఆర్ నోటీసుల జారీ.. విచారణ పారదర్శకంగా నిర్వహించాలి : కలెక్టర్​ భవేష్​ మిశ్రా

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *