SIR Notice Process | ఎస్ఐఆర్ నోటీసుల జారీ.. విచారణ పారదర్శకంగా నిర్వహించాలి : కలెక్టర్​ భవేష్​ మిశ్రా

ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్​లో భాగంగా అనామలీస్, నో మ్యాపింగ్ కేటగిరీలో గుర్తించిన ప్రతి ఓటరుకు నోటీసులు అందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: SIR Notice Process | ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా అనామలీస్, నో మ్యాపింగ్ కేటగిరీలో గుర్తించిన ప్రతి ఓటరుకు నోటీసులు అందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. సోమవారం హైదరాబాద్ (Hyderabad) నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీసీలో సమీక్ష నిర్వహించారు.

SIR Notice Process | అనామలీస్​, నో మ్యాపింగ్​ ఓటర్లకు..

అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు నోటీసుల జారీ, వాటి పంపిణీ, విచారణ ప్రక్రియపై జిల్లాల వారీగా వివరాలు తెలుసుకున్నారు. అనామలీస్, నో మ్యాపింగ్ కేటగిరీలో గుర్తించిన ప్రతి ఓటరుకు నోటీసులు అందించిన అనంతరం సంబంధిత ఓటర్లకు విచారణకు తగిన సమయం కల్పించి, వారి వివరాలను నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. విచారణ ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతి కేసుకు సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు.

నిర్ణీత గడువులోగా నోటీసుల పంపిణీ, విచారణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మల్ కలెక్టరేట్ నుంచి వీసీలో పాల్గొన్న జిల్లా పాలనాధికారి భవేష్ మిశ్రా మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిలో ఉందని, ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరిస్తూ ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దృష్టికి తెచ్చారు. నిర్ణీత గడువులోగా విచారణను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్​లో అదనపు కలెక్టర్ భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Bourampet Car Fire | కారులో మంటలు.. వ్యక్తి సజీవదహనం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *