Ganesh Mandap Registration | గణేష్​ మండపాల వివరాలు పోలీస్ పోర్టల్‌లో నమోదు తప్పనిసరి..: డీజీపీ సీవీ ఆనంద్​

గణేష్​ మండపాల వివరాలు పోలీస్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Ganesh Mandap Registration | గణేష్​ మండపాల వివరాలు పోలీస్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) పేర్కొన్నారు. హైదరాబాద్​(Hyderabad) నుంచి రాష్ట్రంలోని జిల్లాల సీపీలు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు.

Ganesh Mandap Registration | మండపాల వివరాలు సేకరించాలి..​

వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే మండపాల నిర్వాహకులు తమ మండపాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీస్ పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీజీపీ సూచించారు. మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, నిర్వాహకుల పేర్లు, వారి సంప్రదింపు నంబర్లు, విగ్రహానికి సంబంధించిన వివరాలు తదితర పూర్తి సమాచారాన్ని పోలీస్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. దీనివల్ల ప్రతి మండపానికి సంబంధించిన సమాచారం పోలీస్ శాఖ వద్ద అందుబాటులో ఉండాలన్నారు అవసరమైన సమయంలో సమన్వయం చేసుకోవడానికి , భద్రతా చర్యలు చేపట్టడానికి వీలవుతుందని పేర్కొన్నారు.

Ganesh Mandap Registration | నిబంధనలు పాటించాలి..

మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ సూచించే నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. అనుమతులు లేకుండా మండపాలు ఏర్పాటు చేయకుండా సంబంధిత అధికారుల నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవాలని సూచించారు. వినాయక మండపాల వద్ద విద్యుత్ వైర్లు, తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు, జనరేటర్లు తదితర వాటి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అగ్ని ప్రమాదాలకు అవకాశం లేకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. మండపాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయాలని , మహిళలు , పిల్లలు , వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీ సాయిచైతన్య, సీసీఆర్​బీ ఏసీపీ గురునాయుడు, ఏఆర్ ఏసీపీ శ్రీరాములు, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ శ్రీధర్ రెడ్డి, మల్లేశం, రిజర్వ్ ఇన్​స్పెక్టర్​ (అడ్మిన్) ధరణి కుమార్, సీసీఆర్బీ ఇన్​స్పెక్టర్​ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Heavy Rain Alert | రైతులకు గుడ్​న్యూస్​.. 13 నుంచి భారీ వర్షాలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *