తెలంగాణAnde Sri Smruti Vanam | ‘అందెశ్రీ’ స్మృతి వనంపై పట్టింపు కరువు.. ఓట్ల కోసం...

Ande Sri Smruti Vanam | ‘అందెశ్రీ’ స్మృతి వనంపై పట్టింపు కరువు.. ఓట్ల కోసం పక్క రాష్ట్ర నేతల విగ్రహాల ఏర్పాటు

పక్క రాష్ట్రం నేతల విగ్రహాలు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం అందె శ్రీ స్మృతివనం గురించి పట్టించుకోవడం లేదు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ande Sri Smruti Vanam | తెలంగాణ కవి, రచయిత అందెశ్రీ స్మృతివనంపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలంగాణ ఉద్యమకారుడు అయిన అందెశ్రీ కాంగ్రెస్​ అధికారంలోకి రావడానికి కృషి చేశారు.

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక అందెశ్రీకి సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన రాసిన జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర అధికార గేయంగా ప్రకటించారు. అయితే గతేడాది నవంబర్​లో ఆయన కన్నుమూశారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అందె శ్రీ మరణం తర్వాత ఆయన పేరిట స్మృతి వనం నిర్మిస్తామని సీఎం రేవంత్​రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన మరణించి ఆరు నెలలు అవుతున్న దాని గురించి పట్టించుకోలేదు. కనీసం అందెశ్రీని ఖననం చేసిన చోట ఇంత వరకు సమాధి కూడా కట్టలేదు.

Ande Sri Smruti Vanam | ఓట్ల కోసం..

Ande Sri Smruti Vanam

జీహెచ్​ఎంసీ ఎన్నికలు (GHMC Elections) త్వరలో జరగనున్నాయి. దీంతో కాంగ్రెస్​ ప్రభుత్వం సెటిలర్ల ఓట్లపై కన్నేసింది. ఈ క్రమంలో ఇటీవల సీఎం మైత్రివనం జంక్షన్​లో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్​టీఆర్​ విగ్రహాన్ని ఆవిష్కరించారు. హైదరాబాద్ నగరంలో ఆంధ్ర నుంచి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అందులో కమ్మ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్నారు. దీంతో వారి ఓట్లను ప్రసన్నం చేసుకోవడానికే ఎన్​టీఆర్​ విగ్రహం పెట్టారనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు అందెశ్రీ స్మృతి వనం గురించి పట్టించుకోకుండా.. ఎన్​టీఆర్​ విగ్రహం ఏర్పాటు చేయడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు.

Ande Sri Smruti Vanam | ఎలాగైనా గెలవాలని..

Ande Sri Smruti Vanam

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్​ యత్నిస్తోంది. ఈ మేరకు గతంలో నెల రోజుల పాటు ప్రత్యేక శానిటేషన్​ డ్రైవ్ చేపట్టింది. ప్రస్తుతం జోనల్ మున్సిపల్ కమిషనర్లు నిత్యం వీధుల్లో తిరుగుతున్నారు. జలమండలి అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. మరోవైపు జీహెచ్​ఎంసీని ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా విభజించింది. ఓల్డ్​ సిటీ పరిధిలో మజ్లిస్​ హవా కొనసాగే అవకాశం ఉంది. నగరంలో బీజేపీకి కూడా మంచి పట్టు ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెటిలర్లు బీఆర్​ఎస్​ వైపు నిలిచారు. దీంతో కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government) సెటిలర్లను ఆకట్టుకోవడానికి ఎన్టీఆర్​ విగ్రహం ఏర్పాటు చేసినట్లు పలువురు విమర్శిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Balka Suman Arrest | తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. బాల్క సుమన్​ను అరెస్ట్​ చేస్తారా!

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

LPG PNG Rules | గ్యాస్ వినియోగదారులకు షాక్.. జూన్ 1 నుంచి కొత్త రూల్స్

అక్షరటుడే వెబ్‌డెస్క్: LPG PNG Rules | దేశవ్యాప్తంగా గ్యాస్ వినియోగంలో...

Balka Suman Arrest | మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​ అరెస్ట్ 

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balka Suman Arrest | బీఆర్​ఎస్​ నాయకుడు,...

Phone Explosion | జేబులో సెల్​ఫోన్ ఉందా.. తస్మాత్​ జాగ్రత్త..?

అక్షరటుడే, కామారెడ్డి: Phone Explosion | చాలామందికి షర్ట్​ జేబులో సెల్​ఫోన్​...

US Green Card | గ్రీన్‌కార్డ్ విధానంలో మార్పు లేదు.. నిబంధనలపై క్లారిటీ ఇచ్చిన అమెరికా

అక్షరటుడే వెబ్‌డెస్క్: US Green Card | అమెరికా గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు...