తెలంగాణBalka Suman Arrest | తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. బాల్క సుమన్​ను అరెస్ట్​ చేస్తారా!

Balka Suman Arrest | తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. బాల్క సుమన్​ను అరెస్ట్​ చేస్తారా!

తెలంగాణ భవన్​ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అరెస్టు చేసేందుకు నాంపల్లి పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Balka Suman Arrest | తెలంగాణ భవన్​ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అరెస్టు చేసేందుకు నాంపల్లి పోలీసులు (Nampally Police) అక్కడికి చేరుకున్నారు.

ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తెలంగాణ భవన్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు.
బాల్క సుమన్​ ఇటీవల మాట్లాడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింగరేణి ఆస్తులు తగలబెట్టాలని, రైలు పట్టాలను కొసేయాలని వ్యాఖ్యలు చేశారు. ధర్నాలకు ప్రజలు రావడం లేదని, మిలిటెంట్​ యాక్టివిటీలు చేయాలని కార్యకర్తలకు సూచించారు.

ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్ అయింది. దీంతో కాంగ్రెస్​ నేతలు బాల్క సుమన్​పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలని పిలుపునిచ్చిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Balka Suman Arrest | అరెస్ట్​కు రంగం సిద్ధం

Balka Suman Arrest

బాల్క సుమన్​ అరెస్ట్​కు పోలీసులు రంగం సిద్ధం చేశారు. గతంలో మున్సిపల్ ఎన్నికల సమయంలో కూడా మంత్రి వివేక్​ కార్లపైదాడి చేశారని ఆయనను జైలుకు తరలించారు. తాజాగా మరోసారి అరెస్ట్​ చేసేందుకు తెలంగాణ భవన్​కు చేరుకున్నారు. కాగా బాల్క సుమన్​ను శనివారం ఉదయం అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను బీఆర్ఎస్​ నేతలు ఖండించారు. బాల్క సుమన్​ మాట్లాడుతూ.. నేను తెలంగాణ భవన్‌ (Telangana Bhavan)లోనే ఉన్నా.. నన్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది.. అరెస్ట్ చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటా అని పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసులు తెలంగాణ భవన్​కు వచ్చారు.

Balka Suman Arrest

ఇది కూడా చదవండి..: Kishan Reddy Criticism | ధాన్యం సేకరణ ప్రక్రియ దారుణంగా తయారైంది:కిషన్‌రెడ్డి

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

LPG PNG Rules | గ్యాస్ వినియోగదారులకు షాక్.. జూన్ 1 నుంచి కొత్త రూల్స్

అక్షరటుడే వెబ్‌డెస్క్: LPG PNG Rules | దేశవ్యాప్తంగా గ్యాస్ వినియోగంలో...

Balka Suman Arrest | మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​ అరెస్ట్ 

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balka Suman Arrest | బీఆర్​ఎస్​ నాయకుడు,...

Phone Explosion | జేబులో సెల్​ఫోన్ ఉందా.. తస్మాత్​ జాగ్రత్త..?

అక్షరటుడే, కామారెడ్డి: Phone Explosion | చాలామందికి షర్ట్​ జేబులో సెల్​ఫోన్​...