Congress promises | హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Congress promises | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ (Bajireddy Govardhan) ఆరోపించారు. ‘కాంగ్రెస్ వెయ్యి రోజుల దగా’పై బాన్సువాడలో (Banswada) బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో మాట్లాడారు.

Congress promises | బాన్సువాడ నుంచి నిజామాబాద్​కు రోడ్డు..

తమ హయాంలో బాన్సువాడ నుంచి నిజామాబాద్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం, నిజాంసాగర్ కెనాల్ లైనింగ్ వంటి అనేక అభివృద్ధి పనులు చేపట్టామని బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. అప్పటి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేయడంతోనే అభివృద్ధి పనులు జరిగాయని, ఇప్పుడు వాటిని తామే చేశామని చెప్పుకోవడం సరికాదన్నారు. దమ్ముంటే నిధులు తీసుకురండి.. అభివృద్ధి చేసి చూపించండి అంటూ సవాల్ విసిరారు. ప్రజలు ఇచ్చిన అధికారంతోనే ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగురుతోందని, ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వారి పేర్లు రాసి పెట్టుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మోరీల్ శ్రీనివాస్, అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ కోటగిరి శ్రీనివాస్, కిషన్, జుబేర్, ధర్మతేజ, మోచి గణేష్, సాయిబాబా, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ఎవరెస్ట్, ఎల్జీ ఇంగువపై నిషేధం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *