Raghunandan Rao | కాంగ్రెస్ అధ్యక్షుడు కూర్చుంటే లేవలేరు : ఎంపీ రఘునందన్‌రావు

మెదక్​ ఎంపీ రఘునందన్​రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు యువ నాయకుడని, కాంగ్రెస్​ అధ్యక్షుడు కూర్చుంటే లేవలేరన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Raghunandan Rao | మెదక్​ ఎంపీ రఘునందన్​రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు యువ నాయకుడని, కాంగ్రెస్​ అధ్యక్షుడు కూర్చుంటే లేవలేరన్నారు.బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్​ నబిన్​ తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో రఘునందన్​రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమన్నారు. తమ అధ్యక్షుడు యువ నాయకుడని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా ఆయన తెలంగాణలో పర్యటిస్తున్నారని చెప్పారు. కాగా మూడు రోజుల పర్యటన నిమిత్తం నితిన్​ నబిన్​ తెలంగాణకు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Raghunandan Rao | మంత్రి పొన్నంకు కౌంటర్

Raghunandan Rao

మంత్రి పొన్నం (Minister Ponnam) వ్యాఖ్యలకు ఎంపీ రఘునందన్‌రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణకు కేంద్రం సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని పొన్నం ప్రభాకర్​ అన్నారు. బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలకు రఘునందన్​రావు స్పందించారు. తెలంగాణకు కేంద్రం సరిపడా యూరియా పంపిస్తోందని తెలిపారు. రైతులకు యూరియా పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఢిల్లీలో ధర్నా చేసిన వ్యక్తి ఎక్కడున్నారో తెలుసని, రేపు కాంగ్రెస్ ఎక్కడుంటుందో చూడాలని ఎద్దేవా చేశారు. పంపిన యూరియా పంచడం చేతకాని వారు సైతం తమ పార్టీ అధ్యక్షుడి గురించి మాట్లాడుతున్నారన్నారు.

ఇది కూడా చదవండి..: Nitin Nabin Criticisms | తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంటోంది: నితిన్ నబీన్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *