అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Eagle Force | మైనర్లకు సిగరెట్ అమ్ముతున్న పాన్ షాపు యజమానిపై ఈగల్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. షాప్ ఓనర్‌తో పాటు అందులో పని చేసే యువకుడిని అరెస్ట్ చేశారు.
నగరంలోని ఓల్డ్ బోయిన్పల్లి (Old Bowenpalli) గౌరీ నగర్‌లోని న్యూ గ్రామర్ స్కూల్ ఎదురుగా ఉన్న నిమ్రా కేఫ్ సమీపంలో రెండు పాన్ షాపులు పిల్లలకు సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్నాయని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ షాపులు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పనిచేస్తాయని, సాయంత్రం వేళల్లో బాలులు తరచుగా సిగరెట్లు కొనడానికి అక్కడ గుమిగూడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈగల్ ఫోర్స్ ఆ షాపులపై నిఘా పెట్టింది. నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి ఏకంగా అధికారులు 22 సార్లు ఆ దుకాణాలను సందర్శించారు.
Eagle Force | సిగరెట్లు స్వాధీనం
ఇద్దరు మైనర్లు సిగరెట్లు కొనుగోలు చేస్తుండగా.. అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన తర్వాత బోయిన్పల్లి పోలీసుల సమన్వయంతో ఈగిల్ ఫోర్స్ లిమ్రా పాన్ మహల్‌పై దాడి చేసింది. దుకాణ యజమాని మహ్మద్ యూసుఫ్ ఉద్దీన్ గౌరీ (65), అతని కార్మికుడు మహ్మద్ రెహాన్ అలీ (19)లను అరెస్టు చేసింది. రూ.60 వేల విలువైన సిగరెట్లను పోలసీఉలు స్వాధీనం చేసుకున్నారు.
దీనిని కూడా చదవండి : Sajjala Comments | అటెన్షన్ కోసమే విజయ సాయిరెడ్డి ఆరోపణలు : సజ్జల